చంద్రబాబుది బుర్రే బుర్ర.. కులం రంగు పులిమేశాడు..

ఒక స్కాం జరిగింది.. ఒకరిపై ఆరోపణలు వచ్చాయి.. ఇలానే వైఎస్ జగన్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లాడు. ఆయనది అగ్రకులం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే మాత్రం పెడబొబ్బలు పెడుతున్నారు. వెంటనే కులం కార్డును తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేతల అరెస్ట్ లకు, కులానికి ఏంటి సంబంధం అని వైసీపీ ప్రశ్నిస్తోంది. […]

Written By: NARESH, Updated On : June 12, 2020 4:59 pm
Follow us on


ఒక స్కాం జరిగింది.. ఒకరిపై ఆరోపణలు వచ్చాయి.. ఇలానే వైఎస్ జగన్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లాడు. ఆయనది అగ్రకులం కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే మాత్రం పెడబొబ్బలు పెడుతున్నారు. వెంటనే కులం కార్డును తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చిన నేతల అరెస్ట్ లకు, కులానికి ఏంటి సంబంధం అని వైసీపీ ప్రశ్నిస్తోంది. తక్కువ కులం అయితే నేరాలు, ఘోరాలు, అవినీతి చేసి తప్పించుకోవచ్చా అని అడుగుతోంది.

తాజాగా ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై తాజాగా చంద్రబాబు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ మోసాలపై పోరాడుతున్న అచ్చెన్నపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని.. అచ్చెన్న అరెస్ట్ బీసీలపై దాడి అని బాబు మండిపడ్డారు.

కిందాపడ్డా.. మీదపడ్డా చంద్రబాబు తనదే పైచేయిగా ఉండాలని అనుకుంటాడని రాజకీయాల్లో అంటుంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు అచ్చెన్న అరెస్ట్ కు కులం రంగు పులిమడం వైసీపీని షాక్ కు గురిచేసింది. అందుకే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు బయటకొచ్చి మరి అచ్చెన్న అరెస్ట్ కులరంగును పులమడం సిగ్గుచేటు అని ఆడిపోసుకున్నారు.

ఒక కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే అది ఏ విధంగా బీసీలకు సంబంధించినది అన్నది ఇప్పుడు ప్రశ్న. ఏడాదిగా వివరణాత్మక దర్యాప్తు జరిపి టెండర్లలో అవకతవకలు జరిగినట్టు తేలిన తర్వాత ఏసీబీ చర్యలు తీసుకుంది. అయినా స్వయంగా దమ్ముంటే విచారణ జరపండి. అక్రమాలు తేలితే అరెస్ట్ చేయండని అచ్చెన్నాయుడు ఆ మధ్య సవాల్ చేశారు. ఇప్పుడు దాన్నే వైసీపీ ఆధారాలతో చేసి చూపించింది. ఏసీబీ చర్యకు టీడీపీ నేతలు కులం రంగు పులమడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

చంద్రబాబు కోరిన మరో వింత డిమాండ్ ఏంటంటే..? అచ్చెన్నాయుడు అరెస్ట్ కు బాధ్యతగా ఏపీ హోంమంత్రి రాజీనామా చేయాలని కోరడం ఏంటో ఇప్పటికీ రాజకీయ నాయకులకు అర్థం కావడం లేదు. 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ వింత లాజిక్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుకు కుల రాజకీయాలు కొత్తేమీ కాదని.. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు, ఆయన అనుంగ మీడియా ఎలాంటి హంగామా చేసిందో చూశాం. ఇప్పుడు అచ్చెన్న అరెస్ట్ కు బీసీలను వాడుకుంటున్న చంద్రబాబు తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంతైనా 40 ఇయర్స్ ఇండస్డ్రీ చంద్రబాబుది బుర్రే బుర్ర అంటున్నారు.