‘బీజేపీకి వైసీపీ మిత్రపక్షమైంది.. అందుకే ప్రత్యేక హోదా కోసం వైసీపీ కేంద్రాన్ని నిలదీయడం లేదు.. కేంద్రం ఒత్తిడి పెంచడం లేదు’ అంటూ ఎన్నోసార్లు వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు ఇంత నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తుంటాడు. అందుకే కేంద్రం పెడుతున్న ప్రతీ బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని ప్రెస్‌మీట్లలో తన అక్కసు వెల్లగక్కుతూనే ఉంటాడు. గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కూ వైసీపీ మద్దతు ఇచ్చినప్పుడు ఇలాంటి ఆరోపణలే చేశాడు. అయితే.. అప్పటి నుంచి వైసీపీ స్టాండ్‌లో పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. కొంతకాలంగా ఎన్డీఏ పెడుతున్న ప్రతి ప్రతిపాదనకు వైసీపీ మద్దతిస్తూనే ఉంది.
Also Read: వామ్మో….. అమరావతిలో అంత అవినీతి జరిగిందా….?
అయితే.. తాజాగా చంద్రబాబు కూడా ఎన్టీఏకు మద్దతు ఇవ్వడంపై ఇప్పుడు రాజకీయాల్లో వర్గాల హాట్ టాపిక్‌లా మారింది. కేంద్రం పెడుతున్న ప్రతీ బిల్లుకు మద్దతు తెలుపుతున్న వైసీపీపై విమర్శలు చేసిన టీడీపీ.. ఇప్పుడు చేసిందేమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ కంటే ముందుగా టీడీపీ మద్దతిస్తున్నట్లు ప్రకటించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నిజానికి టీడీపీకి ఇప్పుడు కనకమేడల రవీంద్రకుమార్ ఒక్క రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నాడు. మిగితా వారు ఎప్పుడో బీజేపీలో చేరిపోయారు. ఒక్క ఓటు కోసం ఇటు ఎన్డీఏ కానీ.. అటు యూపీఏ నుంచి కానీ చంద్రబాబుకు ఫోన్ రాలేదు. అయినా టీడీపీ ఎన్డీఏకు మద్దతిచ్చింది. సరే.. జగన్‌కు అంటే కేసుల భయం ఉంది కాబట్టి బీజేపీతో చేతులు కలపాల్సి వస్తోందని అనుకోవచ్చు. మరి చంద్రబాబుకు ఏమైంది. ఎన్నికలకు ముందు మోడీని చీల్చి చెండాడుతానని చెప్పి ఊరూరా తిరిగి ఇప్పుడు ఎందుకు బీజేపీ చెంతకు చేరాలని ప్రయత్నిస్తున్నారో తెలియడం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి జగన్ కు మరో సవాల్
అయితే.. ఇందుకు మరో కారణం కూడా వినిపిస్తోంది. భవిష్యత్తులో ఏపీలో బీజేపీతో పెట్టుకోవడానికి.. జగన్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకట. అందుకే అడగకపోయినా కేంద్రానికి సహకరించి మార్కులు కొట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు మీద ఏపీ బీజేపీ నిప్పులా దుంకుతోంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ మళ్లీ ఎలా దగ్గరకు తీసుంది..? చంద్రబాబును వారైనా నమ్మగలరా..? భవిష్యత్ పరిణామాలు ఎండబోతున్నాయో చూడాలి మరి.