మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. ఖైదీ-150 మూవీతో బాస్ ఈజ్ బ్యాక్.. అంటూ టాలీవుడ్లో తన సత్తాను మెగాస్టార్ నిరూపించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన ‘సైరా’ మూవీలో నటించి మెప్పించారు.
Also Read: ప్లీజ్.. ఒక్క పీరియాడిక్ మూవీ చేయు మహేష్
తెరపై ‘సైరా’ నర్సింహారెడ్డి పాత్ర చిరంజీవి ప్రాణంపోశారు. భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ మూవీ తెలుగుతోపాటు పలు భాషల్లో రిలీజైంది. టాలీవుడ్లో బాక్ బస్టర్ హిట్టందుకున్నప్పటికీ మిగతా భాషల్లో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించాడు. అయితే సినిమా పెట్టుబడి మేరకు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ తర్వాత చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ మూవీ వస్తోంది. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఓ స్పెషల్ సాంగులో చిరంజీవితో కలిసి రెజీనా కసండ్రా ఆడిపాడినుంది. చాలా గ్యాప్ తర్వాత మెలోడి బ్రహ్మ మణిశర్మ చిరంజీవి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. ఈ మూవీకి మణివర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.
ఈ మూవీలో చిరంజీవితోపాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆలస్యం అవుతుండటంతో రాంచరణ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చారు. రాంచరణ్ పాత్రలో మహేష్ బాబు నటిస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా రాంచరణ్ ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆచార్య’లో మూవీలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Also Read: అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్?
తన తండ్రి కలిసి నటించడం తన అదృష్టమని రాంచరణ్ తెలిపారు. గతంలోనూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మగధీర’.. ‘బ్రూలీ’.. ‘ఖైదీ-150’లో కొన్ని క్షణాలపాటు నటించినట్లు తెలిపారు. ‘ఆచార్య’లో మాత్రం ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలిపాడు. మేము ఇద్దరు కలిసి నటించాలనేది మా అమ్మ సురేఖ కోరిక అని చెప్పాడు. ఆమె ఆశీర్వాదంతోనే ‘ఆచార్య’లో మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నట్లు తెలిపాడు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన సినిమాలన్నింటికీ రాంచరణే నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. ‘ఆచార్య’ను రాంచరణ్ మ్యాటీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.