Homeఆంధ్రప్రదేశ్‌Imran Khan wife Reham khan :అంత సీన్ లేదు.. ఇమ్రాన్ ఖాన్ పరువు తీసిన...

Imran Khan wife Reham khan :అంత సీన్ లేదు.. ఇమ్రాన్ ఖాన్ పరువు తీసిన ఆయన మాజీ భార్య

Imran Khan wife Reham khan  : ఇప్పటికే పీఎం కుర్చీ కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మరో పిడుగు పడింది. ఈసారి ఆయన మాజీ భార్య అది వేసింది. ఇప్పటికే సైన్యంతో గొడవ పెట్టుకున్న ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయేందుకు రెడీ అయ్యారు. ప్రతిపక్షాలు ఇమ్రాన్ ను గద్దె దించేందుకు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇప్పటివరకూ ఇమ్రాన్ కు మద్దతిచ్చిన భాగస్వామ్య పార్టీలు ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చాయి.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పార్లమెంట్ అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే కనీసం 172మంది ఎంపీలు అవసరం కానీ.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు 168 మంది మాత్రమే మద్దతు ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని పదవిని ఇమ్రాన్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

పులి మీద పుట్రలా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గుట్టును ఆయన మాజీ భార్య బయటపెట్టింది. ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘పాకిస్తాన్ ను పరిపాలించే సామర్థ్యం, తెలివితేటలు ఇమ్రాన్ కు లేవని విమర్శలు గుప్పించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు గత చరిత్ర అంటూ చురకలు అంటించింది. నయా పాకిస్తాన్ పేరు చెప్పి దేశాన్ని భ్రష్టు పట్టించారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టింది.

ఈ క్రమంలోనే ఇమ్రాన్ ను చెత్తతో పోల్చి మరీ ఆయన భార్య అవమానించింది. ‘దేశంలో పేర్చిన చెత్తను శుభ్రం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఇమ్రాన్ భార్య ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కానప్పుడే పాకిస్తాన్ ఉన్నతంగా ఉందని రెహమ్ ఖాన్ ఎద్దేవా చేశారు. 2018లో నయా పాకిస్తాన్ ను నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టింది. కానీ ప్రజల సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిన అసమర్థుడని విమర్శించింది.

దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయారని రెహమ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సాధారణ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిన అసమర్థుడని విమర్శించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ను పరిపాలించే అర్హత ఇమ్రాన్ కు లేదని కుండబద్దలు కొట్టింది.

ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసంలో ఓడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే అందరి పదవులు పోవడం ఖాయం. అదే బ్రహ్మాస్త్రంగా ఆయన వాడాలనుకుంటున్నారు. ఒకవేళ ఇమ్రాన్ దిగిపోతే.. ఆయన స్థానంలో ‘పీఎంఎల్ ఎన్ చీఫ్’ హహబాబ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని కానున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper