Homeఆంధ్రప్రదేశ్‌Gold Cash : ఏపీలో భారీగా బయటపడ్డ బంగారం, నగదు..

Gold Cash : ఏపీలో భారీగా బయటపడ్డ బంగారం, నగదు..

Gold and cash heavily leaked in AP : ఏపీలో కట్టల పాములు బయటకొచ్చాయి.. భారీ బంగారం కూడా పట్టుబడింది. వీటిని ఎక్కడికి ఎవరు తీసుకెళుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇంత భారీగా బంగారం, నగదు పట్టుబడడానికి కారణం ఏంటిది? ఈ నగదు, బంగారం ఎవరిది? అన్నది ఆరాతీస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకే ట్రావెల్స్ కు చెందిన 2 బస్సుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరపల్లి టోల్ ప్లాజా వద్ద బస్సును అడ్డగించిన పోలీసులు తనిఖీలు చేశారు. బస్సు లగేజ్ డిక్కీలలో సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల వరకూ నగదు ఉన్నట్టు అంచనా. ఇలాంటివి అనేక బాక్సులు ఉండడంతో కోట్లలో నగదు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరిచి ఉన్నతాధికారులు వచ్చాక లెక్కించనున్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వెళుతున్న ఏపీ 39 టీబీ 7555 గుర్తించారు. డ్రైవర్ , క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని నగదుపై ఆరాతీస్తున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో బస్సులో 10 కేజీల బంగారం, రూ.4 కోట్ల నగదు గుర్తించారు. వీటిని విశాఖపట్నం తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల విశాఖ పట్నం నుంచే గంజాయి అక్రమ రవాణా ఇతర ప్రాంతాలకు తరలుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక నగదును కూడా అక్కడికే తరలిస్తుండడం అనుమానంగా మారింది. ఇక నక్సలైట్లకు ఈ డబ్బు వెళుతుందా? లేదా ఎవరైనా బిల్డర్లు, రియల్ వ్యాపారులు ఈ డబ్బును తరలిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

4 COMMENTS

  1. […] Kane Williamson Out Controversy: క్రికెట్ లో చాలా వ‌ర‌కు వివాద‌లు త‌లెత్తుతుంటాయి. కొన్ని సార్లు అంపైర్లు ఇచ్చే త‌ప్పుడు నిర్ణ‌యాలు మ్యాచ్ ఫ‌లిత‌ల‌నే మార్చేస్తుంటాయి. తద్వారా గెల‌వాల్సిన టీమ్ ఓడిపోతుంది.. ఓడిపోయే టీమ్ గెలుస్తుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ లో మొన్న స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో జ‌రిగిన చిన్న ఘ‌ట‌న‌.. ఇప్పుడు పెను దుమార‌మే రేపుతోంది. […]

  2. […] Governor Tamilisai: తెలంగాణలో కేసీఆర్ అందరితో వైరం కొనసాగిస్తున్నారు దీంతో భవిష్యత్ లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయనకు అవసరం లేని వారితో అయితే ఓకే కానీ రాజ్యాంగబద్ధంగా నియమితులైన వారిని కూడా కావాలనే పక్కన పెడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మరిచిపోతున్నారు. ఇటీవల కాలంలో గవర్నర్ ను కావాలనే ఉద్దేశంతోనే పక్కకు పెడుతున్నారు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. కానీ అసెంబ్లీ ఆయన సొంత సొత్తు అయినట్లు ప్రవర్తిస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని దూరం చేయడంతో ప్రతిపక్షాల్లో ఆందోళనలు వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. […]

  3. […] Warangal MGM Hospital: అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు ఎంత బాగున్నాయో తెలిపే ఘ‌ట‌న ఇదే కాబోలు. ఎందుకంటే వ‌రంగ‌ల్ లోనే అతిపెద్ద ప్ర‌భుత్వాస్ప‌త్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో పేషెంట్‌ను ఎలుక‌లు కొరిక‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. చికిత్స కోసం వ‌చ్చిన బాధితుడిని ఎలుక‌లు కొర‌క‌డం ఏంటంటూ తీవ్ర విమ‌ర్శ‌లు రేకెత్తాయి. […]

  4. […] Ugadi 2022 Special: శ్రీ శుభకృత్ సంవత్సరంపై ప్రజలు భారీగానే ఆశలు పెంచుకున్నారు. ఇన్నాళ్లు కరోనా భారంతో పండుగ చేసుకునేందుకు కూడా వెనకాడిన ప్రజలు కరోనా ప్రభావం తగ్గడంతో స్వేచ్ఛగా పండుగ చేసుకోవాలని భావించినా పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదనే తెలుస్తోంది. దీంతో అతలాకుతలమైపోతున్నారు. భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించినా వర్తమానమే సరిగా లేదు. పెరుగుతున్న ధరాభారంతో ప్రజలు కుదేలైపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular