https://oktelugu.com/

Education System in AP: ఏపీలో విద్యావ్యవస్థ నిర్వీర్యం. ఆ జీవోలతో అస్తవ్యస్తం

Education System in AP: ఏపీ సర్కారు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లతో పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేస్తే సరిపోదని.. విద్యార్థులను పాఠశాలలకు రప్పించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాల విషయంలో సైతం ఇబ్బందిపెడుతున్నారు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి కల్పించారు. ఇటీవల విద్యావ్యవస్థ మనుగడను ప్రశ్నించేలా.. 172,117 జీవోలను తెచ్చారు. పాఠశాలల విలీనం […]

Written By:
  • Dharma
  • , Updated On : July 14, 2022 / 09:54 AM IST
    Follow us on

    Education System in AP: ఏపీ సర్కారు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లతో పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేస్తే సరిపోదని.. విద్యార్థులను పాఠశాలలకు రప్పించే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాల విషయంలో సైతం ఇబ్బందిపెడుతున్నారు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి కల్పించారు. ఇటీవల విద్యావ్యవస్థ మనుగడను ప్రశ్నించేలా.. 172,117 జీవోలను తెచ్చారు. పాఠశాలల విలీనం పేరుతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించేశారు. దశాబ్దాలుగా గ్రామంలో సేవలందిస్తున్న బడులను సైతం మూసేశారు. మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మా పిల్లలు అంత దూరం వెళ్లలేరు మర్రో అన్న వినే నాథుడు లేడు. ఒక్క ఇంగ్లీష్ మీడియంను ఉంచారు. మాతృభాష ఊసులేదు. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా కొత్త లెక్కలు అందుకున్నారు. టీచర్, స్టూడెంట్స్ నిష్పత్తిని తెరపైకి తెచ్చారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రతీ 53 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో ప్రతీ -60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. ఇంత మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు విద్యాబోధన ఎలా చేయగలరన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోతోంది.

    JAGAN

    అంతా హడావుడి..
    అయితే పేరుకే ‘నాడునేడు’ పథకంలో భాగంగా పాఠశాలల్లో వసతులు, సంస్కరణలు అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. కానీ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ విద్యను ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మిగులు ఉపాధ్యాయ పోస్టులు చూపించి భవిష్యత్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా కొత్త ఎత్తుగడని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

    Also Read: Vice President Venkaiah Naidu: వెంకయ్యనాయుడుకు ఇక రిటైర్మెంటేనా?

    వాటి భర్తీ పై దృష్టిసారించకుండా ప్రభుత్వం రేషన్ లైజేషన్ పేరిట పిల్లలు తక్కువగా ఉన్నారని సాకుచూపి కొన్ని పాఠశాలలను ఎత్తివేసింది. ఈ ఏడాది ఏకంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఎత్తివేసింది. విద్యార్థులతో నిష్పత్తి చూపి మిగులు పోస్టులు ఉన్నట్టు చూపుతోంది. ఇది కచ్చితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీని లేకుండా చేసేందుకేనని ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది.

    JAGAN

    నాటి హామీలేమయ్యాయి?
    నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ ఉపాధ్యాయులపై ఎనలేని ప్రేమ చూపించారు. చంద్రబాబు ఉపాధ్యాయవర్గాన్ని దారుణంగా హింసిస్తున్నారని కూడా తెగ బాధపడిపోయారు. వారిని చంద్రబాబు నుంచి దూరం చేయడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయంగా వారి నుంచి లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చర్యలతో విసిగివేశారిపోయిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 30 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ చూసి ఎద్దేవా చేశారు. అవొక ఉద్యోగాలేనా? అంటూ ఎగతాళి చేశారు. తీరా అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా కొత్తగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. పైగా బైజూస్ వంటి కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ విద్యను ప్రైవేటుపరం చేయడంలో ఎత్తుగడేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు అనుమానిస్తున్నారు.

    Also Read:Dolo-650: జ్వరం మాత్ర ‘డోలీ-650’ లంచాల కథ ఏంటి? అమ్మకాలు పెంచుకునేందుకు ఏం చేసింది?

    Tags