https://oktelugu.com/

Rana Daggubati: ప్రముఖ హీరోయిన్ స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన రానా దగ్గుపాటి

Rana Daggubati: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్న హీరోలలో దగ్గుపాటి రానా కూడా ఒకడు..లీడర్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా రానా మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరిని ఆకర్షించాడు..ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించి బాహుబలి సినిమాలో విలన్ గా చేసి పాన్ ఇండియా వైడ్ విపరీతమైన ఫేమ్ ని సంపాదించుకున్నాడు..ఇక ఆ తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా ఇటీవల విడుదలైన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2022 / 10:05 AM IST

    Rana Daggubati

    Follow us on

    Rana Daggubati: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్న హీరోలలో దగ్గుపాటి రానా కూడా ఒకడు..లీడర్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా రానా మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరిని ఆకర్షించాడు..ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించి బాహుబలి సినిమాలో విలన్ గా చేసి పాన్ ఇండియా వైడ్ విపరీతమైన ఫేమ్ ని సంపాదించుకున్నాడు..ఇక ఆ తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎదురెళ్ళే దీటైన పాత్ర పోషించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు..ఆ తర్వాత విడుదలైన విరాటపర్వం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కూడా నటుడిగా రానా కి మంచి మార్కులే పడ్డాయి..ఇలా మెళ్లిగా సినిమా కెరీర్ ఊపు అందుకుంటున్న సమయం లో రానా కి ఇప్పుడు ఒక సమస్య అడ్డువచ్చి పడింది..దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటుంది.

    Rana Daggubati

     

    ఇక అసలు విషయానికి వస్తే అలనాటి సీనియర్ హీరోయిన్ మాదవి లతకి హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో 2200 చదరపు గజాల స్థలం ఒకటి ఉంది..ఇటీవలే ఆ స్థలాన్ని విక్టరీ వెంకటేష్ మరియు ఆయన సోదరుడు సురేష్ బాబు కొనుగోలు చేసారు..సురేష్ బాబు తన భాగం 1000 చదరపు గజాల స్థలం ని తన పెద్ద కొడుకు దగ్గుపాటి రానా పేరిట రిజిస్టర్ చేయించాడు..అయితే ఈ స్థలం లో ఒక వ్యాపారి 2014 వ సంవత్సరం నుండి లీజుకి ఉంటున్నాడు.

    Also Read: My Village Show Gangavva: వామ్మో గంగవ్వ.. రేంజ్‌ మామూలుగా లేదుగా

    Rana Daggubati

    ఇందుకు గాను మాధవీలత గారితో ఆయన ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు..ఇక సంవత్సరాలు గడుస్తుందే కొద్దీ ఆయన తన లీజుని రెన్యూ చేయించుకుంటూనే ఉన్నాడు..కానీ ఈలోపే మాధవీలత గారు దగ్గుపాటి కుటుంబానికి ఆ స్థలం ని అమ్మేసారు..స్థలం తన పరం అయినా తర్వాత అక్కడి నుండి ఖాళి చెయ్యాలంటూ రానా దగ్గుపాటి ఆ వ్యాపారిని బాగా ఒత్తిడి చేసాడట..ఇక వేరే మార్గం లేక ఆయన ఆ స్థలం ని ఖాళి చేసి , రానా పై కోర్టులో కేసు వేసినట్టు సమాచారం..ఈ నేపథ్యం లో రానా కి కోర్టు నుండి నోటీసులు రావడం తో ఈరోజు ఆ కేసు విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరు కావడం జరిగింది.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    Also Read:Anasuya Bharadwaj: అనసూయ ఒంటిపై పచ్చ బొట్టు… అందులో రహస్యం ఆమె చెప్పాలి
    Recommended Videos



    Tags