https://oktelugu.com/

ట్రంప్‌కు ఉద్వాసన తప్పదా..?

మరో 12 రోజుల్లో ట్రంప్‌ అధికార పీఠం బదిలీ చేయాల్సి ఉంది. కానీ.. గడువు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ వాతావరణం కాస్త నిన్న బీభత్సం సృష్టించింది. వాషింగ్టన్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అధికారం నుంచి తప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ.. ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. 25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే అవకాశాన్ని కేబినెట్ పరిశీలిస్తోంది. దీనిపై యూఎస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2021 / 11:14 AM IST
    Follow us on


    మరో 12 రోజుల్లో ట్రంప్‌ అధికార పీఠం బదిలీ చేయాల్సి ఉంది. కానీ.. గడువు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ వాతావరణం కాస్త నిన్న బీభత్సం సృష్టించింది. వాషింగ్టన్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అధికారం నుంచి తప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ.. ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. 25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే అవకాశాన్ని కేబినెట్ పరిశీలిస్తోంది. దీనిపై యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ సంకేతాలను కూడా ఇచ్చేశారు.

    Also Read: ప్రపంచ కుబేరుడు ఎవరో తెలుసా..?

    నిన్నటి రచ్చపై అటు ప్రపంచ దేశాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల సమావేశాలను ఉద్దేశించి న్యాన్సీ పెలోసీ ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఒక్క క్షణం కూడా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఆయనకు లేదని పేర్కొన్నారు. ట్రంప్‌కు ఉద్వాసన పలకడం అత్యవసర అంశమని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ ఆమె ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సూచించారు.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్‌కు ఉద్వాసన పలికేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు 25వ చట్ట సవరణ ఉపయోగించనున్నారు. దీని ద్వారానే ట్రంప్‌కు ఉద్వాసన పలకడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని, దీనికి అవసరమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని న్యాన్సీ పెలోసీ ఆదేశించారు. దీనికి కేబినెట్ అంగీకరించకపోతే.. తనకు ఉన్న విచక్షణాధికారాలను యూఎస్ కాంగ్రెస్ వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని స్పీకర్ పెలోసీ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    Also Read: ట్రంప్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పంచ్‌ : ఆయన ఖాతాలపై నిషేధం

    డొనాల్డ్ ట్రంప్‌కు మంగళం పలకడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని యూఎస్ కేబినెట్ వెంటనే తీసుకోవాలని న్యాన్సీ పెలోసీ సూచించారు. దీనికోసం మైక్ పెన్స్.. ఎక్కువ సమయం తీసుకుంటారని తాను అనుకోవట్లేదని చెప్పారు. వెంటనే తీర్మానాన్ని రూపొందించాలని ఆదేశించారు. దీనిపై డెమొక్రాట్ల సభాపక్ష నేత ఛుక్ షుమెర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఒక్క రోజు కూడా పదవిలో కొనసాగే అర్హత డొనాల్డ్ ట్రంప్‌కు లేదని స్పష్టం చేశారు. దీనిపై మిగిలిన డెమొక్రాట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులు సైతం మద్దతు పలికారు.

    ఒకవేళ ట్రంప్‌కు ఉద్వాసన పలికితే.. ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసే బాధ్యతను ఉపాధ్యక్షుడికి దక్కుతుంది. ఈ గతంలోనూ జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన సమయంలో అప్పటి ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిని చేశారు. దీనికోసం చట్టాన్ని సవరించారు. అదే 25వ చట్ట సవరణను తాజాగా డొనాల్డ్ ట్రంప్‌పైకి ప్రయోగించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అదే జరిగితే.. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నియమితులవుతారు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు