https://oktelugu.com/

షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే క్లాసిక్ అంటున్నారు !

పదిమందిలో మంచి పేరు సంపాదించాలంటే.. గొప్ప సత్ ప్రవర్తన, విలువైన సదుద్దేశం ఉండాలి. అప్పుడే, అతను మంచివాడు అని, ఆ పదిమంది గుర్తిస్తారు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి మంచివాళ్ళ లిస్ట్ లో ముందువరుసలో ఉండే హీరో ‘నందమూరి కళ్యాణ్ రామ్’. కానీ కళ్యాణ్ రామ్ కి ఎంతమంచి పేరు ఉన్నా.. ఆ పేరును క్యాష్ చేసుకోవాలని ఎప్పుడూ భావించడు, అదే నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ ఓ సందర్భంలో నాగార్జున చెప్పుకొచ్చాడు అంటేనే అర్ధం చేసుకోవచ్చు కళ్యాణ్ […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 11:01 AM IST
    Follow us on


    పదిమందిలో మంచి పేరు సంపాదించాలంటే.. గొప్ప సత్ ప్రవర్తన, విలువైన సదుద్దేశం ఉండాలి. అప్పుడే, అతను మంచివాడు అని, ఆ పదిమంది గుర్తిస్తారు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి మంచివాళ్ళ లిస్ట్ లో ముందువరుసలో ఉండే హీరో ‘నందమూరి కళ్యాణ్ రామ్’. కానీ కళ్యాణ్ రామ్ కి ఎంతమంచి పేరు ఉన్నా.. ఆ పేరును క్యాష్ చేసుకోవాలని ఎప్పుడూ భావించడు, అదే నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ ఓ సందర్భంలో నాగార్జున చెప్పుకొచ్చాడు అంటేనే అర్ధం చేసుకోవచ్చు కళ్యాణ్ రామ్ మంచితనం గురించి. కాకపోతే, మంచి అనేది హిట్ ఇవ్వలేదు కదా. అందుకే కళ్యాణ్ రామ్ కి పేరు వచ్చిన స్థాయిలో.. స్టార్ డమ్ రాలేదు.

    Also Read: త్వరలో ‘ఎన్టీఆర్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

    గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ డమ్ కోసం కళ్యాణ్ రామ్ చేయని ప్రయత్నం లేదు. వైవిధ్యమైన కథలలో విభిన్నమైన పాత్రలు చేసినా.. కళ్యాణ్ రామ్ కి కాలం కలిసిరాలేదు. అందుకే, ఈ సారి ఏకంగా ‘రావణుడి’గా మారబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వేణు మల్లిడి అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో కళ్యాణ్‍ రామ్‍ ఇప్పుడు ఓ పీరియడ్‍ సినిమా నిర్మించబోతున్నాడు. కళ్యాణ్ రామ్, తన బ్యానర్ లో తానే హీరోగా చాలా గ్యాప్‍ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. సినిమానే మొదలుకాలేదు, కానీ అప్పుడే ఈ సినిమా గురించి, ఇండస్ట్రీలో చాల గొప్పగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి కథ ఇంతవరకూ రాలేదు అంటున్నారు.

    Also Read: స్టార్ హీరోలను పట్టడంలో ఆమె మహా దిట్ట !

    వేణు మల్లిడి అరుదైన కథాంశంతో స్క్రిప్ట్ ను రాసుకున్నాడని, పైగా ఈ చిత్రంలో కళ్యాణ్‍ రామ్‍ రావణుడి తరహా పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. దానికి బలం చేకూరుస్తూ వికీ పీడియాలో కూడా ‘రావణ్‍’ టైటిల్‍ అప్‍డేట్‍ చేయడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే మొన్నటివరకూ ఈ సినిమాకి ‘తుగ్లక్‍’ అనే మరో టైటిల్ కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా కోసం భారీగా గ్రాఫిక్స్ కూడా చేయాలట, అందుకే తన మార్కెట్‍ కంటే కూడా, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి రెండింతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారట. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఈ సినిమా క్లాసిక్ అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్