https://oktelugu.com/

జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?

ఈ కరోనా టైంలో అమెరికా ప్రెసిడెంట్‌ నుంచి అనకాపల్లి బుల్లోడు వరకు వినియోగిస్తున్నారు. ఆ మాస్కుల్లోనూ ఎన్నో వెరైటీలు. ఒక్కో మాస్క్‌కు ఒక్కో ధర. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎన్95 మాస్కులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి 200 రూపాయల లోపే దొరుకుతున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ కొందరు ధనికులు.. డబ్బున్న వాళ్లు మాస్క్ ల్లోనూ భారీతనం చూపిస్తున్నారు. Also Read: జగన్ సర్కార్ కు మరో షాక్.. రమేశ్ ఆస్పత్రికి ఊరట ఇప్పటికే పూణేలో ఓ […]

Written By: , Updated On : September 4, 2020 / 04:34 PM IST
jaganmohanreddy mask

jaganmohanreddy mask

Follow us on


jaganmohanreddy mask
ఈ కరోనా టైంలో అమెరికా ప్రెసిడెంట్‌ నుంచి అనకాపల్లి బుల్లోడు వరకు వినియోగిస్తున్నారు. ఆ మాస్కుల్లోనూ ఎన్నో వెరైటీలు. ఒక్కో మాస్క్‌కు ఒక్కో ధర.
కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎన్95 మాస్కులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి 200 రూపాయల లోపే దొరుకుతున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ కొందరు ధనికులు.. డబ్బున్న వాళ్లు మాస్క్ ల్లోనూ భారీతనం చూపిస్తున్నారు.

Also Read: జగన్ సర్కార్ కు మరో షాక్.. రమేశ్ ఆస్పత్రికి ఊర

ఇప్పటికే పూణేలో ఓ వినియోగదారుడు  2.89 లక్షల రూపాయల బంగారంతో తయారు చేసిన మాస్క్ ను తయారు చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  ఇప్పుడు నేనేమైనా తక్కువ తిన్నాన అని వజ్రాల సిటీ అయిన సూరత్ కు చెందిన ఒక ధనవంతుడు ఆభరణాలు.. వజ్రాలతో అలంకరించబడిన మాస్క్ లను తయారు చేయించుకున్నాడు. దీని ఏకంగా 4 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. ఎప్పుడూ సాదాసీదాగానే ఉండడానికే ప్రాధాన్యం ఇస్తాడు. వైట్‌ షర్ట్‌.. కాకి కలర్‌‌ ప్యాంట్‌ ఎక్కువగా ధరిస్తుంటాడు. ఏపీలోకి కరోనా వైరస్‌ వచ్చినా సీఎం మొదట్లో పెద్దగా మాస్క్‌లు వాడేవారు కాదు. ఎప్పుడో ఒకసారి బయట ప్రోగ్రాంలకు వెళ్తేనో.. పరామర్శలకు వెళ్తేనోసిబ్బంది ఇచ్చే సర్జికల్‌ మాస్క్‌లు ధరించేవారు. ఆ మాస్కులు ఆయనకు అంతగా పడలేదంట. అందుకే ఈ సారి ట్రెండ్‌ మార్చాడు. వైట్‌ షర్ట్‌ పైన ఆ బ్లూ కలర్‌‌ సర్జికల్‌ మాస్క్‌ అంతగా బాగాలేదనుకున్నాడు కావచ్చు.

తాజాగా జగన్‌ ధరించిన వైట్‌ మాస్క్‌ అందరిలోనూ చర్చకు దారితీసింది. ఇదేం మాస్క్‌ అబ్బా..? చాలా కంఫర్ట్‌గా కనిపిస్తోంది..? ఎక్కడ దొరుకుతుంది..? ఎంత ఉండొచ్చు..? అని ఆలోచనలు అందరినీవెంటాడాయి.

Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

అంత పెద్ద హోదాలో ఉన్న జగన్‌ వాడుతున్న మాస్క్‌ ధర ఎంతో తెలుసా.. కేవలం.. యాభై రూపాయలు మాత్రమే. ఇటీవల ఎవరో తన గురువు ఆ మాస్క్‌ ధరించి జగన్‌ దగ్గరికి వచ్చారంట.దానిని చూసి ఫ్లాట్‌ అయిన జగన్‌ అలాంటి మాస్క్‌లే తెప్పించారంట. అవి ఎక్కడో కాదు రామ్‌ రాజ్‌ కాటన్‌ నుంచే. సీఎం జగన్‌ వాటిని ధరించి అలా కనిపించాడో లేదో ఇప్పుడు ఎవరి మొఖానికి చూసినా అవే మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి.