https://oktelugu.com/

జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

సీఎం జగన్ కర్ర విరగకుండా పాము చచ్చేలా వ్యూహాత్మకంగా వెళుతున్నాడా? సీక్రెట్ గా టీడీపీ కుంభకోణాలు వెలికి తీయిస్తున్నాడా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో జగన్ పడ్డారు. గత ప్రభుత్వం హయాంలో అమలైన స్కీంలు.. వాటిలో జరిగిన అవినీతిని అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రబాబు అమలు చేసిన ‘నీరు–చెట్టు’ స్కీంపై ఫోకస్‌ పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టారు. Also Read : జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2020 / 04:39 PM IST

    Jaganmohanreddy tdp

    Follow us on

    సీఎం జగన్ కర్ర విరగకుండా పాము చచ్చేలా వ్యూహాత్మకంగా వెళుతున్నాడా? సీక్రెట్ గా టీడీపీ కుంభకోణాలు వెలికి తీయిస్తున్నాడా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో జగన్ పడ్డారు. గత ప్రభుత్వం హయాంలో అమలైన స్కీంలు.. వాటిలో జరిగిన అవినీతిని అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రబాబు అమలు చేసిన ‘నీరు–చెట్టు’ స్కీంపై ఫోకస్‌ పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టారు.

    Also Read : జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?

    గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ‘పచ్చ’ పార్టీల నేతలు అందినకాడికి దండుకున్నారనేది ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో పత్రికల్లోనూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. దాదాపు 30 వేల కోట్లతో చేపట్టిన ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయి. గ్రామాల్లోని చెరువుల్లోని పూడిక తీసి.. ఆ మట్టితో చెరువు కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా.. ఆ మట్టినీ అమ్ముకుని ‘పచ్చ’దండు కోట్లు కొల్లగొట్టాయనే విషయంపై గతంలో కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇప్పుడు జగన్‌ టీం కూడా ప్రతీ స్కీం మీద లోతుగా ఆరా తీస్తున్నాయి. ప్రధాన పోస్టుల్లో ఉన్న ఐఏఎస్‌లందరూ అదే పనిలో ఉండిపోయారు.

    ‘నీరు–చెట్టు’ పథకంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామన్న జగన్‌.. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండడంతో ఇక మర్చిపోయారేమోనని అందరూ భావించారు. టీడీపీ నేతల్లోనే ఇక తమకు ఏం కాదనే ధీమా కనిపిచింది. కానీ.. వైసీపీ ప్రభుత్వం దీనిపై ఇప్పుడు చాపకింద నీరులా దర్యాప్తు ప్రారంభించిందని, పక్కా ఆధారాలతో చర్యలకు దిగేందుకు సిద్ధంగా ఉందని ఇప్పుడు బయటికి పొక్కడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ మేరకు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది.

    Also Read : జగన్ సర్కార్ కు మరో షాక్.. రమేశ్ ఆస్పత్రికి ఊరట

    ‘నీరు–చెట్టు’ స్కీంకు సంబంధించిన నిధులు ప్రభుత్వం ఇంకా తమకు ఇవ్వడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్‌‌ ఇప్పటికే హైకోర్టును సంప్రదించారు. దీనిపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ స్కీంలో భారీగా అవకతవకలు జరిగాయని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎంక్వైరీ జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అందుకే నిధుల విడుదల నిలిపివేశామని నివేదించింది. నివేదికలు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరువర్గాల వాదన హైకోర్టు కూడా విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

    గ్రామాల్లో వినియోగంలో లేని చెరువులు, గట్లకు మరమ్మతుల పేరుతో గ్రామస్థాయి నుంచి టీడీపీ లీడర్లు దోచుకున్నారనే ఆరోపణలు ఉండడంతో ప్రభుత్వం విచారణ దిగింది. అంటే.. ఈ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో వైసీపీ ప్రభుత్వం బిజీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎట్‌ ద సేమ్‌ టైం అవినీతి రుజువు అయితే ఎంత మంది మెడకు ఉచ్చు బిగుస్తుందోనని టీడీపీ నేతల్లో భయం మొదలైంది.

    Also Read : కరోనా: ‘ప్రైవేట్’ దోపిడీపై జగన్ ఉక్కుపాదం