Disha Rule: దిశా చట్టం: ఏపీలో వైసీపీ, టీడీపీ రాజకీయం

Disha Rule: ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh) రాజకీయం (Politics) రమ్య హత్య కేసు చుట్టు తిరుగుతోంది. వైసీపీ(YCP) చర్యలపై టీడీపీ(TDP) విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాలే వేదికగా ఎంచుకుంది. గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజు హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటోందని డిమాండ్ చేస్తోంది. రాష్ర్ట హోం మంత్రి సుచరిత దిశ(Disha) చట్టం అమలుపై పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని చెబుతున్న నేపథ్యంలో టీడీపీ మరింత అవ్వాంటేజీగా […]

Written By: Srinivas, Updated On : August 23, 2021 3:37 pm
Follow us on

Disha Rule: ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh) రాజకీయం (Politics) రమ్య హత్య కేసు చుట్టు తిరుగుతోంది. వైసీపీ(YCP) చర్యలపై టీడీపీ(TDP) విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాలే వేదికగా ఎంచుకుంది. గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజు హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటోందని డిమాండ్ చేస్తోంది. రాష్ర్ట హోం మంత్రి సుచరిత దిశ(Disha) చట్టం అమలుపై పకడ్బందీగా ముందుకు వెళుతున్నామని చెబుతున్న నేపథ్యంలో టీడీపీ మరింత అవ్వాంటేజీగా తీసుకుని రమ్య హత్య కేసులో వేగం ఏదని ప్రశ్నిస్తోంది. నిందితుడికి 21 రోజుల్లో ఉరిశిక్షవేయాలని సూచిస్తోంది.

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ అసమర్థతతోనే బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం వల్లే అరాచకాలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. శిక్ష విధించేందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఈ విషయంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ తీరును వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.

మహిళలపై ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? వారిపై ఏ మేరకు శిక్షలు పడుతున్నాయి అనే విషయాలు టీడీపీ లెక్కలతో సహా వెల్లడిస్తోంది. దీనికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ సైతం లోకేష్ డెడ్ లైన్ పెట్టడంతో ఆయనకేం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న కేసుల విషయంలో కోర్టులున్నాయని చెబుతున్నారు.

దిశ చట్టం అమలులో ఉండగా నేరాలు పెరిగిపోతున్నాయని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చట్ట ప్రకారం 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడాలని సూచిస్తున్నా ఇంతవరకు ఎంత మందికి శిక్షలు పడ్డాయని అడుగుతున్నారు. రమ్య హత్య విషయంలో కూడా ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వెళుతోంది అని వాపోతున్నారు. చట్టం పకడ్బందీగా అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది మరోలా ఉందని విమర్శిస్తున్నారు. రమ్య హత్య కేసులో సాధ్యమైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూడాలని కోరుతోంది.