Chandrababu- NTR: మన కులపోడు కాదు.. జూ.ఎన్టీఆర్ పెళ్లిని చంద్రబాబు ఆపాలని చూశాడా?

ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైసీపీలో ఉన్నారు. అటు తారక్ మామ నార్నె శ్రీనివాసరావు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీనివాసరావు పెద్ద బిల్డర్.

Written By: Dharma, Updated On : August 25, 2023 12:44 pm

Chandrababu- NTR

Follow us on

Chandrababu- NTR: నందమూరి నట వారసుడిగా తెరపైకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ యంగ్ స్టార్ గా వెలుగొందుతున్నారు. పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో నటిస్తున్నారు. అనతి కాలంలోనే తన స్టార్ డంను పెంచుకున్నారు. అయితే ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన వివాహాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తారక్ కు లక్ష్మీ ప్రణతి తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది. అయితే తారక్ వివాహం చంద్రబాబు చొరవతోనే జరిగిందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. లక్ష్మీ ప్రణతి తల్లి చంద్రబాబుకు స్వయానా మేనకోడలు. అప్పట్లో చంద్రబాబు ఇరువైపులా పెద్దదిక్కుగా నిలిచి తారక్ వివాహాన్ని జరిపించారని ఒక టాక్ ఉండేది. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు లక్ష్మి పార్వతి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మన కులం వాడు కాదని.. మన ఇంటి పిల్లని ఎలా ఇస్తారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు లక్ష్మీపార్వతి చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావు తనకు చెప్పారని చెబుతుండడం విశేషం.

ప్రస్తుతం లక్ష్మీపార్వతి వైసీపీలో ఉన్నారు. అటు తారక్ మామ నార్నె శ్రీనివాసరావు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీనివాసరావు పెద్ద బిల్డర్. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ,ఎమ్మెల్యే సీట్లు ఆశించినా దక్కకపోవడంతో జగన్ గూటికి చేరారు. అయినా సరే అక్కడ కూడా గుర్తింపు లేకుండా పోయింది. ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. అయితే అదే శ్రీనివాస రావు తనతో చెప్పారని లక్ష్మీపార్వతి చెబుతుండడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా వీరు కలిసిన సందర్భాలు లేవు. మొన్నటి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం తారక్ దూరంగా ఉన్నారు. ఇటీవల హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. తారక్ తో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సందడి చేశారు. అటు కళ్యాణ్ రామ్ సైతం ఆడియో ఫంక్షన్ లో తమ కుటుంబం అంతా ఒకటేనని చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్ వివాహాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే లక్ష్మీపార్వతి వ్యాఖ్యల్లో నిజం లేదని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు.