Homeఆంధ్రప్రదేశ్‌Sunil Apology To Jagan: వైసీపీ అధినేత జగన్ కు సునీల్ క్షమాపణలు.. ఇంతకీ ఏం...

Sunil Apology To Jagan: వైసీపీ అధినేత జగన్ కు సునీల్ క్షమాపణలు.. ఇంతకీ ఏం జరిగింది..

Sunil Apology To Jagan: సోషల్ మీడియా వాడకం ఒక స్థాయి వరకు ఉండాలి. అది పరిధి దాటిపోతే వేరే విధంగా ఉంటుంది.. ఆ తర్వాత పరిణామాలు మారిపోతూ ఉంటాయి. అప్పటికి జ్ఞానోదయం కలగకపోతే.. పరిస్థితులు తలకిందులు అవుతుంటాయి. బహుశా ఈ విషయం ఇతడికి తెలిసింది. ఆలస్యంగా నైనా జ్ఞానోదయం అయింది. చేసిన తప్పు తెలుసుకున్నాడు. క్షమించండి అంటూ అడిగాడు.

అతని పేరు సునీల్.. పూర్తి పేరు రావినూతల సునీల్.. ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇతడు టిడిపి సోషల్ మీడియా క్రియేట్ చేసే వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా జగన్ ను అనుకరిస్తూ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 2024 లో ఎన్నికల సమయంలో ఇతడి మీద టిడిపి సోషల్ మీడియా అనేక రకాలుగా వీడియోలు రూపొందించింది. ఆ తర్వాత వాటిని విపరీతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేసింది.

సునీల్ ఈమధ్య జగన్ సతీమణి భారతి రెడ్డిని ఉద్దేశించి ఒక వీడియో రూపొందించాడు. ఆ వీడియో అత్యంత దారుణంగా ఉంది. అందులో కంటెంట్ కూడా బి గ్రేడ్ స్థాయిలో ఉంది. ఇటువంటి కంటెంట్ పట్ల వైసిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో సునీల్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు. దీంతో సునీల్ కు సినిమా అర్థమైంది. అతడు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో కూడా చేశాడు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు.

సునీల్ ఒక ఆర్టిస్ట్. వైసీపీ అధినేత జగన్ ను అద్భుతంగా అనుకరిస్తాడు. అదేవిధంగా మాట్లాడుతుంటాడు. కానీ అది ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. జగన్ ను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడమే కాకుండా.. అతని కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా తీవ్రమైన స్థాయిలో ట్రోల్ చేయడం వైసిపి అభిమానులకు ఇబ్బంది కలిగించింది. అందువల్లేవారు సునీల్ మీద మండిపడుతున్నారు. సునీల్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. పరిస్థితి అర్థమయి సునీల్ క్షమాపణ చెప్పాడు.. దీంతో వైసిపి నేతలు శాంతించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version