Homeబిజినెస్Motorola Edge 70 Max: స్క్రీన్ చాలా స్మూత్.. భారీ బ్యాటరీ.. Motorola నుంచి ఎడ్జ్...

Motorola Edge 70 Max: స్క్రీన్ చాలా స్మూత్.. భారీ బ్యాటరీ.. Motorola నుంచి ఎడ్జ్ సిరీస్.. ధర ఎంతంటే..

Motorola Edge 70 Max: భారతదేశంలో Motorola మొబైల్స్ కు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. చాలా మంది ఈ కంపెనీకి చెందిన ఫోన్లను కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ కంపెనీకి చెందిన ఎడ్జ్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. భారతదేశంలో జూలై 15న అధికారికంగా విడుదల కానుండడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. ఇంతకీ ఇది ఏ ఫోన్? దీని ధర ఎంత?

మోటరోలా నుంచి కొత్త మోడల్ Motorola Edge 70 Max విడుదల కానుంది ఈ సిరీస్‌లో ‘మాక్స్’ బ్రాండింగ్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. లాంచ్ తర్వాత ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్ల ద్వారా వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది.

మోటోరోలా నుంచి ఫోన్లు ఇప్పటి వరకు కర్వ్‌డ్ డిజైన్ తో వచ్చేవి. కానీ ఈసారి రూట్ మార్చింది. ఎడ్జ్ 70 మాక్స్ ఫోన్‌ను పూర్తిగా ఫ్లాట్ ఎడ్జ్ ప్రొఫైల్‌తో డిజైన్ చేసింది. దీనికి ప్రీమియం లుక్ ఇచ్చేలా అల్యూమినియం ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను అమర్చారు. వెనుక భాగంలో చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ మొబైల్ ఆకర్షణీయమైన లైట్ గ్రీన్, లైట్ బ్లూ (Glacier Blue) రంగుల్లో లభించనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల AMOLED క్వాడ్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తోంది. దీని స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేయడానికి 144Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ తో ఉండనుంది. ఎలాంటి వాతావరణంలోనైనా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా రికార్డు స్థాయిలో 7,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందించారు.

పనితీరు విషయంలో ఈ ఫోన్ నెక్స్ట్ లెవెల్‌లో అనుకోవచ్చు. క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి ఫోన్లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఇందులో గరిష్టంగా 12GB RAM, ఆన్ డివైస్ AI ప్రాసెసింగ్ ఫీచర్లు ఉంటాయి. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి యాక్టివ్‌మెష్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ సన్నని డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ.. ఇందులో ఏకంగా 7,100mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీకి 90W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మోటోరోలా ఈ ఫోన్ ద్వారా పరిచయం చేస్తోంది. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఛార్జర్లు , యాక్సెసరీలను సులభంగా ఫోన్ వెనుక స్టిక్ చేసుకోవచ్చు. భారతదేశంలో దీని ధర సుమారు రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిని ఎడ్జ్ 70 ప్రో ప్లస్ కంటే ఉన్నతమైన ప్రీమియం మోడల్‌గా పేర్కొన్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version