https://oktelugu.com/

This Week OTT Releases: ఓటీటీలో బ్రో, బేబీతో పాటు మరిన్ని క్రేజీ చిత్రాలు!

నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా తెరకెక్కిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 25, 2023 / 12:51 PM IST

    This Week OTT Releases

    Follow us on

    This Week OTT Releases: ఈ శుక్రవారం ఓటీటీలో రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చేశాయి. వీటితో పాటు కొన్ని క్రేజీ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందించారు. వినోదాయ సితం రీమేక్ గా తెరకెక్కిన బ్రో జులై 28న విడుదలైంది. ఈ చిత్రం నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేసింది. బ్రో ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 25 నుండి స్ట్రీమ్ అవుతుంది.

    దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కేవలం పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. బోల్డ్ కంటెంట్ తో ట్రయాంగిల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులు ఆహా సొంతం చేసుకోగా నేటి నుండి స్ట్రీమ్ అవుతుంది. ఎడిట్ చేయకుండా నిడివి పెంచి విడుదల చేశారని టాక్.

    నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా తెరకెక్కిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. జులై 29న విడుదలైన ఈ చిత్రం ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్ర ఆదరణ దక్కించుకుంటున్నట్లు సమాచారం.

    అలాగే ఫిజ్జా సిరీస్లో మూడో పార్ట్ గా వచ్చింది ఫిజ్జా 3. ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో వారం లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఫిజ్జా 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక థియేట్రికల్ రిలీజెస్ చూస్తే… బెదురులంక 2012, గాండీవధారి అర్జున, బాయ్స్ హాస్టల్ రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాలన్నీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాల సందడి లేదు.