https://oktelugu.com/

Allu Arjun: పార్టీ లేదా పుష్ప..!!. స్నేహ.. అయాన్…తో పుష్ప రాజ్ పార్టీ

సుకుమార్ దర్శకత్వంలో పుష్పరాజుగా ఇరగదీసారు అల్లు అర్జున్. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ని తప్ప మనం ఎవరిని ఊహించుకోలేం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 25, 2023 / 12:37 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్.. ఈ పేరు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. ‘పుష్ప’ చిత్రం జాతీయ పురస్కారాల్లో సత్తా చాటడానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. అందులో ముఖ్య కారణం అల్లు అర్జున్ అద్భుతమైన నటన.

    సుకుమార్ దర్శకత్వంలో పుష్పరాజుగా ఇరగదీసారు అల్లు అర్జున్. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ని తప్ప మనం ఎవరిని ఊహించుకోలేం.‘పుష్ప’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తిరుగులేని ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దుమ్మురేపింది. ఇక పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ మాస్‌ అప్పీల్‌ బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలై ఎన్ని రోజులు అయిన తర్వాత పుష్ప రాజ్ క్యారెక్టర్ కి మరో ఘనత దక్కింది. పుష్ప సినిమాకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో టాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ఘనత సాధించిన తొలి టాలీవుడ్ హీరోగా బన్నీ రికార్డు కొట్టేశాడు. దీంతో నిన్నటి నుంచి అల్లు అర్జున్, పుష్ప ది రూల్ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

    అయితే ఈ హ్యాష్ ట్యాగ్‌ క్లిక్ చేస్తే ఇప్పుడు మొదటగా ఒక వీడియో సందడి చేస్తోంది. అదేమిటి అంటే ఈ అవార్డు ప్రకటించగానే అల్లు స్నేహ ఇక అల్లు అయాన్ తో మన పుష్ప రాజ్ పార్టీ. ఆ వీడియోలో అవార్డు గురించి తెలియగానే అల్లు అర్జున్ భార్య స్నేహ ..అల్లుఅర్జున్ ని హగ్ చేసుకుంటూ కనిపించింది. ఆనందంలో అల్లు అర్జున్ స్నేహాన్ని హగ్ చేసి ఎత్తుకోవడం పక్కనే అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఉందడం .. అయాన్ కూడా అల్లు అర్జున్ ని హగ్ చేసుకోవడం కానీ స్నేహ అల్లు అర్జున్ కి ముద్దు పెట్టడం.. ఇలా ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాడు మన పుష్ప.

    ఇక ఫ్యామిలీతో ఎంతో ఎమోషనల్ గా కనిపించిన అల్లు అర్జున్ వీడియో కింద ఎంతోమంది.. పార్టీ లేదా పుష్ప అని అడుగుతున్నారు. పార్టీ మాట పక్కన పెడితే మొత్తానికి మన తెలుగు ప్రేక్షకులను ఫైనల్ గా బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చుకొని ఖుషి చేసేసారు బన్నీ.