Homeబిజినెస్Nissan Tekton SUV: జూలై 20న సిద్ధంగా ఉండండి.. 5 స్టార్ రేటింగ్ కారు వస్తోంది..

Nissan Tekton SUV: జూలై 20న సిద్ధంగా ఉండండి.. 5 స్టార్ రేటింగ్ కారు వస్తోంది..

Nissan Tekton SUV: ఇటీవల కాలంలో చాలా మంది మిడ్ సైజ్ SUV కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా వాటితో పోలిస్తే ఇవి ధర తక్కువగానూ.. కంపర్టుగానూ ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని నిస్సాన్ కంపెనీ ‘ టెక్టాన్’ కారును అధికారికంగా లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు భారతీయ రోడ్లపై పట్టు సాధించేందుకు ఆరు ట్రిమ్స్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ కార ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? దీని ధర ఎంత?

కాలం మారుతున్న మిడ్ సైజ్ ఎస్ యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా Nissan Tekton SUV లాంచ్‌కు ముందే భద్రత పరంగా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించింది. దీనితో పాటు లెవెల్ 2 ADAS , 3D అరౌండ్ వ్యూ మానిటర్ వంటి 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కొత్త కారులో టర్బో పెట్రోల్ తో సహా రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 100 PS పవర్ మరియు 166 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 19.4 కిలోమీటర్ల మైలజ్ అందిస్తుంది. మరోటి శక్తివంతమైన 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 163 PS పవర్, 280 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

కారు లోపలి భాగం ప్లమ్, బర్గుండి డ్యూయల్-టోన్ కలర్ థీమ్‌తో రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో లగ్జరీగా డిజైన్ చేయబడింది. ఇందులో 10.1- అంగుళా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ పవర్డ్ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా, లగేజీ కోసం ఏకంగా 700 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను ఇది కలిగి ఉంది. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Nissan Tekton SUV ప్రారంభ ధరను కంపెనీ రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల వరకు ఉంటుంది. జూలై 20 నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version