https://oktelugu.com/

పుసుక్కున గెలిచావ్ జగన్.. హేళన చేసిన పవన్

‘పవర్’ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులను పేల్చుతూ వినోదాన్ని పంచుతున్నారు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అదే రీతిలో తన వాగ్ధాటిని కొనసాగిస్తుండడం విశేషం. ఇప్పటికే గుడివాడలో మంత్రి నానిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘సీఎం సాబ్ కు వకీల్ సాబ్’ చెప్పాడని చెప్పండి అంటూ పవన్ పేల్చిన డైలాగులు ఎవరో మరిచిపోరు.. Also Read: ఇదేం అరాచకం..: ఏపీ సర్కార్‌‌పై పవన్‌ ఫైర్‌‌ తాజాగా మరోసారి తిరుపతిలో రాజకీయ వ్యవహారాల కమిటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2021 5:04 pm
    Follow us on

    CM Jagan Pawan Kalyan

    ‘పవర్’ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులను పేల్చుతూ వినోదాన్ని పంచుతున్నారు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా అదే రీతిలో తన వాగ్ధాటిని కొనసాగిస్తుండడం విశేషం. ఇప్పటికే గుడివాడలో మంత్రి నానిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘సీఎం సాబ్ కు వకీల్ సాబ్’ చెప్పాడని చెప్పండి అంటూ పవన్ పేల్చిన డైలాగులు ఎవరో మరిచిపోరు..

    Also Read: ఇదేం అరాచకం..: ఏపీ సర్కార్‌‌పై పవన్‌ ఫైర్‌‌

    తాజాగా మరోసారి తిరుపతిలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. అదృష్టం కలిసి వచ్చి వైసీపీకి అందలం దక్కిందని.. వైఎస్ జగన్ సీఎం అయ్యాడని పవన్ కళ్యాణ్ కించపరిచేలా వ్యాఖ్యానించారు. లక్ లేకపోతే అసలు వైసీపీ గెలిచేది కాదని ఎద్దేవా చేశారు.

    గిద్దలూరులో ఎమ్మెల్యేను జనసైనికుడు నిలదీస్తే ఆత్మహత్య చేసుకునే వరకు వైసీపీ నేతలు భయపెట్టారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఏపీలో రాజకీయంగా వాడుకుంటున్నారని.. దళితులపైనే ప్రయోగిస్తున్నారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు..

    Also Read: ఇంతకీ తిరుపతిలో బలం జనసేన/బీజేపీలో ఎవరికుంది?

    తిరుపతిలో పోటీపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని.. దానిపై ఆలోచిస్తామని పవన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలతో అవగాహన ఉందని.. రాష్ట్రంలోని వారితో మాత్రం అంతగా లేదని పవన్ హాట్ కామెంట్స్ చేశారు.మ రో వారం రోజుల్లోనే తిరుపతిలో బీజేపీనా? జనసేన పోటీచేస్తుందా తెలుస్తుందన్నారు. ఏపీలో బీజేపీ-జనసేన కూటమియే ప్రత్యామ్మాయం అని పవన్ స్పష్టం చేశారు.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడినా.. పవన్ సైతం రెండు సీట్లలో ఓడిపోయినా సరే.. జనసేనాని పవన్ లో ఆ ధీమా మాత్రం తగ్గకపోవడం గమనార్హం. తిరుపతిలో గెలుపు అంత ఈజీ కాదని తెలిసినా పవన్ మాత్రం రాజకీయంగా వేడిపుట్టిస్తూనే ఉన్నాడు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్