మృతదేహంలో కరోనా ఎంత సమయం ఉంటుందో తెలుసా?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా దాటికి ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడంతో ఫ్యామిలీతో సంబంధాలు మళ్లీ దగ్గరయ్యాయి. అయితే కరోనా పాజిటివ్ వస్తే మాత్రం మానవత్వం మంటగిలిసేలా ప్రతీఒక్కరూ దూరంగా జరుగుతున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్ కరోనా పాజిటివ్ సోకగానే ఆ వ్యక్తిని అంటరానివాడిగా చూస్తున్న సంఘటనలు అనేకం […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 8:06 pm
Follow us on


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా దాటికి ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడంతో ఫ్యామిలీతో సంబంధాలు మళ్లీ దగ్గరయ్యాయి. అయితే కరోనా పాజిటివ్ వస్తే మాత్రం మానవత్వం మంటగిలిసేలా ప్రతీఒక్కరూ దూరంగా జరుగుతున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

కరోనా పాజిటివ్ సోకగానే ఆ వ్యక్తిని అంటరానివాడిగా చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కన్నపేగు బంధం కూడా దూరమవుతోంది. భార్యభార్తలు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ల బంధం సైతం కరోనా కారణంగా విడిపోతున్న సంఘటనలు నిత్యం వార్తల్లోనే చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. అయితే ఇటీవలీ కాలంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాతో మృతిచెందిన వారికి కనీస దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదు. వారి మృతదేహాలను అనాథశవాల్లా సాగనంపుతుండటం సోషల్ మీడియాల్లోనే వైరల్ అవుతూనే ఉన్నాయి. కరోనాతో మృతిచెందే వారికి చివరిచూపు కూడా కరువవుతోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు దూరంగా జరుగుతున్నారు. కరోనా మృతదేహన్ని తాకితే తమకు కూడా ఎక్కడ సోకుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

దీంతో కరోనా వైరస్ మృతదేహంలో ఎంతకాలం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.దీనిని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే మృతదేహం నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువ ఉన్నాయట. ఒక వ్యక్తి చనిపోయాక అతడి మృతదేహంలో కరోనా వైరస్ ఆరుగంటలు మాత్రమే బతికి ఉంటుందట. ఆ తర్వాత మృతదేహం నుంచి కరోనా వ్యాపించదని తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి వెల్లడించారు.

ఇటీవల చాలాచోట్ల కరోనాతో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయకుండా స్థానిక ప్రజలు అడ్డకుంటారని చెప్పారు. కరోనాపై అవగాహన పెంచుకోకుండా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకనైనా కరోనా మృతదేహాలకు కనీస దహన సంస్కార మర్యాదలు దక్కుతాయని ఆశిద్దాం..