https://oktelugu.com/

పార్టీలో మెగా ఫ్యామిలీ…నిహారిక గ్రాండ్ పార్టీ

నాగబాబు గారాల తనయ నిహారిక పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సందడి షురూ అయ్యింది. చాలా కాలం తర్వాత చిరంజీవి కుటుంబంలో జరుగుతున్న అతిపెద్ద వేడుక, ఘన నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. డిసెంబర్ 9వ తేదీన నిహారిక-జొన్నలగడ్డ చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. Also Read: పేరుకే విడాకులు, బంధం బలంగానే కొనసాగుతుందా? నిహారిక పెళ్లి […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 03:41 PM IST
    Follow us on


    నాగబాబు గారాల తనయ నిహారిక పెళ్లి నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సందడి షురూ అయ్యింది. చాలా కాలం తర్వాత చిరంజీవి కుటుంబంలో జరుగుతున్న అతిపెద్ద వేడుక, ఘన నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. డిసెంబర్ 9వ తేదీన నిహారిక-జొన్నలగడ్డ చైతన్యల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.

    Also Read: పేరుకే విడాకులు, బంధం బలంగానే కొనసాగుతుందా?

    నిహారిక పెళ్లి పత్రిక కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఏనుగులు, రాజప్రాసాదాలతో కూడిన బొమ్మలతో అందమైన బాక్స్ లో గ్రాండ్ గా సిద్ధం చేశారు. ఖరీదైన వెడ్డింగ్ కార్డులో అరుదైన స్వీట్స్ నింపి మరీ బంధువులను ఆహ్వానించారు. కాగా. మరో ఏడు రోజులలో వివాహం కాగా మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ చెక్కేయనున్నారు. అయితే పెళ్లి వేడుకకు ముందే నాగబాబు ఇంటిలో మెగా కుటుంబ సభ్యులు గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. పెళ్లి కూతురు నిహారిక, పెళ్లి కొడుకు చైతన్యలతో కుటుంబ సభ్యులు సందడి చేశారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్, శిరీష్, వైష్ణవ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక స్నేహారెడ్డి, శ్రీజలతో పాటు మెగా ఫ్యామిలీ యూత్ మొత్తం ఈ పార్టీలో కనిపించారు.

    ఇక షూటింగ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్, చరణ్ ఈ ఫ్యామిలీ పార్టీకి హాజరుకాలేకపోయారు. అయితే రాజస్థాన్ లో జరగనున్న పెళ్లి వేడుకకు మాత్రం అందరూ హాజరుకానున్నారని సమాచారం. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ హాజరకాని తరుణంలో ఈ సారి ఎలాగైనా పవన్ పెళ్ళికి వచ్చేలా నాగబాబు ఆయనను ఒప్పించారట.

    Also Read: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

    మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వెండితెరకు పరిచమైన ఒకే ఒక అమ్మాయి నిహారిక కాగా కొన్ని చిత్రాలలో నటించారు. చిరంజీవి పాన్ ఇండియా మూవీలో సైరాలో గెస్ట్ రోల్ చేశారు. నిర్మాతగా కూడా నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లు తెరకెక్కించారు. గుంటూరుకి చెందిన పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో ఆగస్టులో నిహారికకు నిశ్చితార్థం జరిగింది.