AP CM Y S Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్తేమీ కాదు. ఇదివరకే ఆయనపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. దీంతో ఆయన కేసులకు భయపడకుండానే ముందుకు వెళ్తున్నారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సమన్లు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. 2014లో జరిగిన తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై సమన్లు జారీ చేయడం గమనార్హం.
ఈ నెల 28న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేతల్లో ఆందోళన మొదలైంది. జగన్ పై అక్రమాస్తుల కేసుతో పాటు పలు కేసులు సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపై చాలా కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కేసులో సమన్లు జారీ కావడంతో వైసీపీ నేతలు భయాందోళన చెందుతున్నారు.
Also Read: RRR Movie Ticket Prices: ఆర్ఆర్ఆర్ థియేటర్ల ఓనర్లకు షాక్.. ఏపీలో రంగంలోకి రెవెన్యూ అధికారులు..
2014 లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం కోర్టులు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్ తోపాటు మిగతా ఇద్దరికి సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఇప్పటికే కొనసాగుతున్న కేసులతోపాటు ఇది కూడా వాటి వరుసలో చేరుతుంది.
ఎన్నికల కోడ్ విషయంలో అప్పుడు జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇప్పుడు వారు కోర్టుకు హాజరు కాక తప్పదు. దీనిపై కూడా వాదనలు పూర్తయ్యాక కేసు పరిష్కారం కావడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. మొత్తానికి జగన్ మెడలో కేసుల హారం దండలా మారుతున్నాయి కేసులు. ఎప్పటికి పరిష్కారమయ్యేనో చూడాలి మరి.
Also Read: IT Raids Tension In TRS: టీఆర్ ఎస్ నేతల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గట్టిగానే డిసైడ్ అయిందా…?
Recommended Video: