https://oktelugu.com/

Raja Mouli: అది విడుదలయ్యి ఉంటే రాజమౌళి ఇప్పుడు హీరో అయ్యేవాడే!

Raja Mouli: దర్శకధీరుడు రాజమౌళి ఎంత బాగా సినిమాలు తీస్తాడో ఆయన సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఓ శిల్పాన్ని చెక్కినట్టు ఆయన సినిమాలు చెక్కుతుంటాడు. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అనే బిరుదు కూడా రాజమౌళికి వచ్చింది. ఈ దర్శకధీరుడు ఇప్పుడు ప్రపంచం గర్వించే దర్శకుడిగా ఎదిగాడు. అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు.. అలాంటి వారిలో ఇప్పుడు రాజమౌళి కూడా వచ్చి చేరారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 24, 2022 / 03:26 PM IST
    Follow us on

    Raja Mouli: దర్శకధీరుడు రాజమౌళి ఎంత బాగా సినిమాలు తీస్తాడో ఆయన సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఓ శిల్పాన్ని చెక్కినట్టు ఆయన సినిమాలు చెక్కుతుంటాడు. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అనే బిరుదు కూడా రాజమౌళికి వచ్చింది. ఈ దర్శకధీరుడు ఇప్పుడు ప్రపంచం గర్వించే దర్శకుడిగా ఎదిగాడు.

    Raja Mouli

    అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు.. అలాంటి వారిలో ఇప్పుడు రాజమౌళి కూడా వచ్చి చేరారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న రాజమౌళి తాజాగా తాను దర్శకుడిని అవ్వాలనుకోలేదని.. అదే జరిగి ఉంటే ఇప్పుడు హీరోగానో.. నటుడిగానే అయ్యిండేవాడిని అంటూ సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

    Also Read: Ram Charan NTR RRR Movie: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఎక్కువై.. రాంచరణ్ తక్కువైనా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు

    స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తమ కెరీర్ ను స్ట్రాట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఇదే మొదటి సినిమా.. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో సినిమా ఇండస్ట్రీలో ఎవరు సీనియర్ అనే ప్రస్తావన రాగా.. ‘తానే సీనియర్ అంటూ జూ.ఎన్టీఆర్.. లేదు నీకంటే నేనే సీనియర్ అని రాజమౌళి పట్టుబట్టాడు’. ఈ క్రమంలోనే చరిత్రలు తవ్వుకున్నారు.

    స్టూడెంట్ నంబర్ 1 కంటే ముందే తాను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి వివరించాడు. తాను చిన్నప్పుడే నీకంటే ముందే బాలనటుడిగా చేశానని ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చాడు. ఈక్రమంలోనే ఇప్పటిదాకా చెప్పని ఓ రహస్యాన్ని రాజమౌళి బయటపెట్టాడు. అదేంటంటే..? ‘తాను చిన్నప్పుడు పదేళ్ల వయసులో ‘పిల్లనగ్రోవి’ అనే సినిమాలో బాలనటుడిగా చేశాడనని.. నీకంటే నేనే సీనియర్ అని ఎన్టీఆర్ కు రాజమౌళి వివరించారు. సినిమాల్లో మొత్తానికి రాజమౌళియే సీనియర్ అన్న విషయం తెలిసి వచ్చింది.

    Also Read: Sarkaru Vaari Paata: సర్కారువారి పాటను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. మహేష్ బ్రేక్ చేస్తాడా..?

    Recommended Video:

    Tags