https://oktelugu.com/

ముక్కోణ పోరులో బాబు అవుట్..!

చంద్రబాబు కల చెదిరింది. 2024 ఎన్నికలనాటికి బ్రతిమిలాడో, బహుమతులు ఇచ్చో బీజేపీతో దోస్తీ చేసి 2014 మాదిరి లబ్ది పొందాలన్న ఆశకు శాశ్వతంగా తెరపడింది. ఇక టీడీపీతో బీజేపీ దోస్తీ అనేది జరగని పని అని తెలిసిపోయింది. ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ తొలగింపు, సోము వీర్రాజు ఎన్నికతో ఈ విషయం స్పష్టం అయ్యింది. సొంతగా ఎదిగితే తప్ప, టీడీపీతో కలవడం వలన వారికి ఒనగూరుతున్న ప్రయోజనం లేదని తెలుసుకున్న బీజేపీ అధిష్టానం, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 29, 2020 12:28 pm
    Follow us on


    చంద్రబాబు కల చెదిరింది. 2024 ఎన్నికలనాటికి బ్రతిమిలాడో, బహుమతులు ఇచ్చో బీజేపీతో దోస్తీ చేసి 2014 మాదిరి లబ్ది పొందాలన్న ఆశకు శాశ్వతంగా తెరపడింది. ఇక టీడీపీతో బీజేపీ దోస్తీ అనేది జరగని పని అని తెలిసిపోయింది. ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ తొలగింపు, సోము వీర్రాజు ఎన్నికతో ఈ విషయం స్పష్టం అయ్యింది. సొంతగా ఎదిగితే తప్ప, టీడీపీతో కలవడం వలన వారికి ఒనగూరుతున్న ప్రయోజనం లేదని తెలుసుకున్న బీజేపీ అధిష్టానం, కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని తాజా పరిణామంతో తెలుస్తుంది. కనీసం పవన్ కళ్యాణ్ అన్నా కాపాడతాడు అనుకుంటే ఆయన తెలివిగా ఆదిలోనే బీజేపీతో దోస్తీ కట్టారు. జనసేన బలం తెలిసిన పవన్ కనీసం జాతీయ స్థాయిలో బలంగా ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరడం ఆయనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. నిజం కూడా అదే.

    Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

    ఇప్పటి నుండి టీడీపీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యే సూచనలు కలవు. ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికైన సోము వీర్రాజు టీడీపీ ప్రలోభాలకు లొంగే రకం కాదు. గతంలో కూడా ఆయన బాబును తీవ్రంగా విమర్శించారు. పొత్తు పేరుతో బీజేపీకి కేటాయించిన సీట్లలో బాబు తనకు అనుకూలురైన బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి, మోసం చేయాలని చూశారు అన్నారు. ఎప్పటి నుండో బాబుతో పొత్తుకు సోము వీర్రాజు వ్యతిరేకం. ఇకపై ఆయన టార్గెట్ అధికార వైసీపీతో పాటు, ప్రతిపక్ష టీడీపీ కూడా. కాబట్టి గత ఐదేళ్లలో బాబు చేసిన అవినీతిని కూడా ఆయన గట్టిగా ప్రశ్నించే అవకాశం కలదు.

    Also Read: కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?

    జగన్ ని ఎదుర్కోవడానికి బాబు ఆయుధాలైన బీజేపీ మరియు జనసేనలు ఒకటి కావడంతో పాటు ఆయనకు దూరమయ్యారు . దీనితో బాబుకు ఏమీ పాలుపోవడం లేదు. బాబుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం ఆయన్ని కలవరపెడుతుంది. ఇప్పటికే బలహీన పడిన టీడీపీ 2024 ఎన్నికల సమయానికి కోలుకోవడం కష్టమే. దానికి తోడు బాబు పార్టీ బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నుండి బలమైన నాయకులు వలస బాటపట్టే ఆస్కారం ఉంది. దీనితో ముందు ముందు బాబుకు గడ్డుకాలమే కనిపిస్తుంది. ఎప్పటి నుండో సంస్థాగతంగా పాతుకు పోయిన టీడీపీ ఊపిరి పోసుకోవాలంటే, జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావాలి. జగన్ సంక్షేమాల జోరులో అది అసాధ్యమే. కాబట్టి ట్రై సిరీస్ లో బాబు అవుట్ అయ్యేలా ఉన్నాడు.