https://oktelugu.com/

మహమ్మరి గుప్పిట్లో మహానగరం

చైనా మహ్మమరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 కొనసాగుతోంది. జూన్ 30వరకు ఇది కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 3, 4లలో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దాదాపు అన్నిరంగాలకు షరతులతో కూడిన అన్నిరంగాలకు అనుమతి ఇవ్వడంతో తిరిగి మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో కంట్రోల్లోనే ఉంటుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైన కేసులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 8, 2020 / 10:30 AM IST
    Follow us on


    చైనా మహ్మమరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 కొనసాగుతోంది. జూన్ 30వరకు ఇది కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 3, 4లలో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దాదాపు అన్నిరంగాలకు షరతులతో కూడిన అన్నిరంగాలకు అనుమతి ఇవ్వడంతో తిరిగి మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో కంట్రోల్లోనే ఉంటుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైన కేసులు ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగజేస్తోంది. కరోనా కేసులు లేని జిల్లాల్లో కూడా ప్రస్తుతం కొత్త కేసులు నమోదవుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

    హైదరాబాద్లో డేంజర్ బేల్స్..
    జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. తొలినాళ్లలో పాతబస్తీ లాంటి ప్రాంతాలకే పరిమిత కేసులు ప్రస్తుతం అన్ని ఏరియాల్లో నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం వల్లనే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు అన్నిరంగాలకు అనుమతి లభించడం, రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్ క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నట్లు కన్పిస్తుంది. దీంతో గాంధీ ఆస్పత్రి కరోనా పేషంట్లతో నిండుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైద్యులపై అదనపు భారం పెరగడంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. నిమ్స్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సైతం కరోనా బారిన పడటం చూస్తుంటే వైరస్ ఎంత స్పీడుగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    మూడురోజుల్లోనే 500 కొత్త కేసులు..
    హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. జనవరి 30న రాష్ట్రంలో తొలి కరోనా కేసును గుర్తించారు. తొలి 500 కేసులు నమోదవడానికి 39రోజులు సమయం పట్టింది. అనంతరం 500నుంచి వెయ్యికి చేరడానికి 15రోజులు సమయం పట్టింది. 1500చేరడానికి 20రోజుల సమయం పట్టింది. 2వేల మార్క్ చేరడానికి మరో పది రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత క్రమంగా రోజుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2వేల తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే మరో 500కేసులు పెరిగాయి. ఆ సంఖ్య ప్రస్తుతం ఐదు రోజుల నుంచి మూడురోజులకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 500కేసులు నమోదవుతుండటం వైరస్ విజృంభణకు అద్దంపడుతుంది. ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో 376, మేలో 876, జూన్ తొలి వారంలోనే 638కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య పరిశీలిస్తే మహానగరంలో కరోనా కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!