Site icon OkTelugu

Pawan Kalyan: ఆ హీరోయిన్ తో సినిమా చేయొద్దు అంటూ పవన్ కళ్యాణ్ ని హెచ్చరిస్తున్న ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన తదుపరి చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో పంచుకున్నాడు. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19 న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక గ్యాంగ్ స్టోరీ స్టోరీ అని, అదే విధంగా అన్నదమ్ముల స్టోరీ కూడా అని, పవన్ కళ్యాణ్ కి తమ్ముడిగా మరో స్టార్ హీరో నటిస్తాడని, సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ చిత్రానికి సంబంధించి రోజుకి ఒక అప్డేట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుండడంతో, ఇప్పటి నుండే అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అభిమానులను కలవరపెడుతోంది. అసలు విషయం లోకి వెళ్తే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇమాన్వి ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈమె ప్రస్తుతం ప్రభాస్ , హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈమెతో కలిసి నటించడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆమె పాకిస్థాన్ దేశానికీ చెందిన అమ్మాయి. ‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో ‘ఫౌజీ’ లో ఈమె నటిస్తున్నందుకు ఫ్యాన్స్, మూవీ లవర్స్ తప్పుబట్టారు. శత్రు దేశానికీ చెందిన అమ్మాయితో సినిమా అవసరమా అంటూ డైరెక్టర్ హను ని ట్యాగ్ చేసి పెద్ద రచ్చ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ప్రభాస్ తో కాబట్టి ఈ విషయాన్నీ మర్చిపోయారని, కానీ పవన్ కళ్యాణ్ తో చేస్తే నేషనల్ వైడ్ గా పెద్ద వివాదాలకు దారి తీస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పైగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ కూడా ఉంది. ఒకవేళ శత్రు దేశానికీ చెందిన ఈ అమ్మాయితో కలిసి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే, లెఫ్ట్ భావజాలాలు ఉన్న ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ని తగలబెట్టేస్తారు. పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేయకపోయినా పెద్ద తప్పు చేసినట్టు లెఫ్ట్ ఎకో సిస్టం ఫేక్ ప్రచారాలను ఒక రేంజ్ లో వ్యాప్తి చేయడం వంటివి గతం లో మనం చాలానే చూశాము. ఇప్పుడు ఇలా నేరుగా పాకిస్తాన్ అమ్మాయితో కలిసి నటిస్తే ఇక అంతే సంగతులు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి అభిమానుల రిక్వెస్ట్ ని మూవీ టీం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది.

Exit mobile version