హైకోర్టును ఆశ్రయించిన వైద్యురాలు..!

వైద్యుడు సుధాకర్ ఘటన ఓ కొలిక్కి రాక ముందే అధికార పార్టీ, ప్రభుత్వం ఇటువంటిదే మరో ఘటనలో ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై, అధికార పార్టీ నాయకులపై ఓ వైద్యురాలు హైకోర్టును ఆశ్రయించారు. తనను అధికార పార్టీ నాయకులు నిర్బంధించి వేధింపులకు గురి చేశారని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని […]

Written By: Neelambaram, Updated On : June 8, 2020 11:17 am
Follow us on


వైద్యుడు సుధాకర్ ఘటన ఓ కొలిక్కి రాక ముందే అధికార పార్టీ, ప్రభుత్వం ఇటువంటిదే మరో ఘటనలో ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై, అధికార పార్టీ నాయకులపై ఓ వైద్యురాలు హైకోర్టును ఆశ్రయించారు. తనను అధికార పార్టీ నాయకులు నిర్బంధించి వేధింపులకు గురి చేశారని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ అనితారాణి తనకు జరిగిన అవమానాన్ని ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నా తనను వేధింపులకు గురిచేశారని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో దిగువ స్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతిని ప్రశ్నించి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే స్థానిక వైసీపీ నాయకులు తనను ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ పెట్టిన మార్చి 22వ తేదీన గ్రామంలోని హాస్టల్ గదిలో ఆసుపత్రి సిబ్బంది తనను నిర్బంధించి స్థానిక వైసీపీ నాయకులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని తనను దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెట్టారని, వాష్ రూమ్ కు వెళుతుంటే విడియో తీసి వేధించారని, అవమానకరమైన దూషణలకు పాల్పడ్డారని వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత మహిళ కావడంతో మరింత వివక్షకు గురి చేశారన్నారు. సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు వల్ల మానసికంగా ధైర్యం వచ్చి తాను హైకోర్టులో వారం రోజుల కిందట పిటీషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

సంఘటన జరిగిన మరుసటి రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పోలీసు కేసు పెట్ట వద్దని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తనపై వత్తిడి తెచ్చారని తెలిపారు. దీంతో తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేక ఇన్నాళ్లు మిన్నకుండిపోయానని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వైద్యులు ప్రాణాలను సైతం లెక్కేచేయకుండా సేవాలందిస్తుంటే ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఇలా వేధింపులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.