https://oktelugu.com/

ఆచార్య.. సోషల్ మెసేజ్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే.. ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ విషయానికొస్తే కొరటాల వాటికి ఏ మాత్రం వెనుకాడరు. కాబట్టి సినిమాలో బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2020 / 10:08 AM IST
    Follow us on


    కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే.. ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ విషయానికొస్తే కొరటాల వాటికి ఏ మాత్రం వెనుకాడరు. కాబట్టి సినిమాలో బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చిరు చూస్తారు. కాబట్టి చిరు నుండి ‘ఖైదీ నెం 150’ లెవల్లో స్టెప్స్ ఈ సినిమాలో కూడా ఆశించవచ్చు.

    ఇక మెగాస్టార్ కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల సినిమాల్లో కామెడీ పెద్దగా ఉండదు. ఆయన సినిమాల్లోని హీరోలంతా ఎప్పుడూ సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు. పైగా కామెడీ లాంటి ట్రాక్స్ కొరటాల ఎప్పుడూ రాసింది లేదు. కాబట్టి ఈ చిత్రంలో కామెడీకి స్కోప్ ఉండకపోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రావడం ఖాయం. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

    మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.