Homeఎంటర్టైన్మెంట్NTR: 'మే' నెల ఎన్టీఆర్ ఫ్యాన్స్ జీవితంలో ఎప్పుడూ మర్చిపోని జ్ఞాపకంగా మారనుందా?

NTR: ‘మే’ నెల ఎన్టీఆర్ ఫ్యాన్స్ జీవితంలో ఎప్పుడూ మర్చిపోని జ్ఞాపకంగా మారనుందా?

NTR: ప్రతీ ఏడాది మే 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఏ స్థాయిలో జరుపుతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కటౌట్లు, బ్యానర్లు, రక్త దానాలు, అన్నదానాలు ఇలా ఒక్కటా రెండా, ఒక పండుగ లాగా ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుతుంటారు. ఈ ఏడాది అంతకు మించిన రేంజ్ లో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు ఫ్యాన్స్. అంతే కాదు, ఈ మే నెల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ గా మారనుంది. విషయం ఏమిటంటే ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జోర్డాన్ లో రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని మే20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారట మేకర్స్.

ఈమేరకు ఎన్టీఆర్ పీఆర్ నిన్న ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేయడం తో , సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయ్యింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఒక మంచి యాక్షన్ టీజర్ కట్ ని ఇప్పటికే రెడీ చేసి ఉంచారని, మే20 న విడుదల అవ్వబోయే ఈ టీజర్ మూవీ లవర్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని, ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని యాక్షన్ షాట్స్ ని ఈ టీజర్ లో పొందుపరిచారని, ఈ ఒక్క టీజర్ తో చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ లుక్ కూడా హాలీవుడ్ యాక్షన్ హీరో ని తలపించే రేంజ్ లో డిజైన్ చేసాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఇప్పటికే పొడవాటి గడ్డంతో ఎన్టీఆర్ లుక్ ని ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉన్నదో మీరంతా చూసే ఉంటారు. కానీ సినిమాలో ఇంకా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తాడట. ఇకపోతే ఈ చిత్రం తో పాటు , ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా మే 20న రాబోతుందని అంటున్నారు. ఈ సినిమా పై కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అలా ఈ రెండు సినిమాల అప్డేట్స్ తో ఎన్టీఆర్ అభిమానులు అనడంతో ఉక్కిరిబిక్కిరి కాబోతున్నారు. చూడాలి మరి ఈ రెండు అప్డేట్స్ లో ఏది సోషల్ మీడియా ని ఎక్కువ రూల్ చేయబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version