Site icon OkTelugu

Chiranjeevi And Udayakiran: చిరంజీవి, ఉదయకిరణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ అదేనా..?

Chiranjeevi And Udayakiran

Chiranjeevi And Udayakiran

Chiranjeevi And Udayakiran: కెరీర్ ప్రారంభం లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్న హీరోల్లో ఒకరు ఉదయ్ కిరణ్(Uday kiran). ఆరోజుల్లో ఉదయ్ కిరణ్ యూత్ ఆడియన్స్ లో సృష్టించిన సెన్సేషన్ సాధారణమైనది కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడం, తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దృష్టిలో కూడా పడడం, స్వయంగా చిరంజీవి తన కూతురుని పెళ్లి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం అప్పట్లో ఒక సెన్సేషనల్ టాపిక్. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తో అప్పట్లో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణే తనకు, సుష్మిత కి ఎక్కడో వర్కౌట్ అవ్వడం లేదని, ఈ పెళ్లిని చేసుకోలేనని చెప్పి పక్కకు జరిగాడు.

ఆ తర్వాత చిరంజీవి కోపంతో ఉదయకిరణ్ ని తొక్కేశాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఇప్పటికీ ఇది నిజమని నమ్మే జనాల సంఖ్య ఎక్కువే. కానీ స్వయంగా ఉదయ్ కిరణ్ అక్కనే అలాంటివేమీ లేదని, చిరంజీవి, ఉదయ్ కిరణ్ లు గురు శిష్యులు లాగా ఉండేవారని, తన జీవితంలో ఏ అంశం లో అయినా సలహా కావాలంటే ఉదయ్ కిరణ్ వెంటనే చిరంజీవి వద్దకు వెళ్ళేవాడిని, వాళ్ళ మధ్య అనుబంధం ఆ రేంజ్ లో ఉండేదని చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో చిరంజీవి, ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో ఒక సినిమాని నిర్మించాలని అనుకున్నాడట మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. చిరంజీవి అన్నయ్య, ఉదయ్ కిరణ్ తమ్ముడిగా ఒక మంచి స్క్రిప్ట్ ని కూడా రెడీ చేయించాడట. ఉదయ్ కిరణ్ కూడా అప్పట్లో వరుస సక్సెస్ లతో మంచి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్నాడు.

ఇక మెగాస్టార్ సంగతి తెలిసిందే, ఎవర్ గ్రీన్ నెంబర్ 1 హీరో..వీళ్ళ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే అప్పట్లో సౌత్ ఇండియా షేక్ అయ్యేది. అందుకే ఆ ఆలోచనతోనే అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా ని సెట్ చేసాడట. కానీ ఆ చిత్రం అప్పట్లోనే బడ్జెట్ లిమిటేషన్స్ ని దాటడం తో, వర్కౌట్ అవ్వడం కష్టమేమో, భవిష్యత్తులో చేద్దామని పక్కన పెట్టారట. కానీ భవిష్యత్తులో జరిగిన పరిణామాల కారణంగా ఉదయ్ కిరణ్ తో మెగాఫ్యామిలీ కి బాగా గ్యాప్ పెరిగింది. ఈ డ్రీం కాంబినేషన్, చివరికి డ్రీం గానే మిగిలిపోయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సంక్రాంతి’. ఇందులో వెంకటేష్ పాత్ర ని చిరంజీవి, శ్రీకాంత్ పాత్రని ఉదయ్ కిరణ్ పోషించాల్సింది. 2005 లో ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా కథ 2002 లోనే చిరంజీవి వద్దకు వచ్చింది.

Exit mobile version