Homeఎంటర్టైన్మెంట్Hero Arjun: విశ్వక్ సేన్ పై నాకు ఎలాంటి కోపం లేదు..అతనికి మంచి భవిష్యత్తు ఉంది...

Hero Arjun: విశ్వక్ సేన్ పై నాకు ఎలాంటి కోపం లేదు..అతనికి మంచి భవిష్యత్తు ఉంది – హీరో అర్జున్

Hero Arjun: యాక్షన్ కింగ్ గా సౌత్ లో ఒకప్పుడు హీరో గా ఎన్నో సంచలన విజయాలను నమోదు చేసుకున్న అర్జున్, ఈమధ్య కాలం లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని భాషల్లో నటిస్తూ, నేటి తరం ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ దర్శకుడిగా మారి ‘సీతా పయణం’ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేస్తోంది. నిరంజన్ అనే కొత్త యువకుడు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమాని ముందుగా అప్పట్లో హీరో విశ్వక్ సేన్ తో చెయ్యాలని అనుకున్నాడు అర్జున్. ఈ చిత్రం పూజ కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత, రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుంది అనగా, విశ్వక్ సేన్ ఈ చిత్రం నుండి తప్పుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అర్జున్ నేరుగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి విశ్వక్ సేన్ పై అప్పట్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. విశ్వక్ సేన్ కూడా అప్పట్లో వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య చిన్న గ్యాప్ అప్పటి నుండి ఏర్పడిపోయింది. అయితే ఇప్పుడు అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’, అదే విధంగా విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘ఫంకీ’ చిత్రాలు ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ సినిమాలో అయితే విశ్వక్ సేన్ హీరో గా నటించాలని అనుకున్నాడో, ఇప్పుడు అదే సినిమాతో పోటీ పడబోతున్నాడు. ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ విశ్వక్ సేన్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘మా సినిమాతో పాటు విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వక్ సేన్ మంచి టాలెంట్ ఉన్న యువకుడు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది. నాకు, అతనికి మధ్య కుదరలేదని అతనిపై ద్వేషం, కోపం పెంచుకోవడం కరెక్ట్ కాదు. విశ్వక్ సేన్ అమ్మ చేతి వంట తిన్న వ్యక్తిని నేను. వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. గడిచే కాలం తో పాటు, మనం కూడా కొన్ని విషయాలను మర్చిపోతూ ముందుకు సాగాలి’ అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు . ఆయన మాట్లాడిన ఈ పాజిటివ్ మాటలను చూసి నెటిజెన్స్ ఫిదా అయిపోయారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version