https://oktelugu.com/

రేపు విడుదల కానున్న రష్యా వ్యాక్సిన్.. ‘కరోనా’కు చెక్!

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు కరోనా తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన దేశంగా అరుదైన ఘనతను అందుకోనుంది. రేపు కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రష్యా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ను అందిస్తామని ఆ దేశం చెబుతోంది. ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 11, 2020 / 01:08 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు కరోనా తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన దేశంగా అరుదైన ఘనతను అందుకోనుంది. రేపు కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రష్యా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ను అందిస్తామని ఆ దేశం చెబుతోంది.

    ఈ వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న మూడు వారాల తరువాత రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని…. మరో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం రెట్టింపవుతుందని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందించాయి. అడినో వైరస్ భాగాలతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను జూన్ నెలలో 76 మందిపై ప్రయోగించారు.

    వ్యాక్సిన్ ను సగం మందికి ఇంజక్షన్ రూపంలో సగం మందికి పౌడర్ రూపంలో ఇచ్చామని… రెండు రకాల వేర్వేరు పరీక్షల్లో వ్యాక్సిన్ సానుకూల ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని వెల్లడిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాలని రష్యాకు సూచించింది. అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాక్సిన్ ను ప్రజలకు పంపిణీ చేసే ముందు సమస్యలు తలెత్తుతాయో లేదో పరిశీలించుకోవాలని రష్యాకు సూచించారు.