వైసీపీ కి షాక్..? రాజధాని విషయంలో చివరికి వెనక్కి తగ్గిన జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా ఉంచేలా తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు లో విశాఖ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. అందుకు గవర్నర్ ఆహీస్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖ కు తరలించేందుకు ఈనెల 16ని సరైన తేదీగా ఖరారు చేసుకున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి ఆగస్టు 16న ఎగ్జిక్యూటివ్ […]

Written By: Navya, Updated On : August 11, 2020 1:31 pm
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా ఉంచేలా తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు లో విశాఖ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. అందుకు గవర్నర్ ఆహీస్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖ కు తరలించేందుకు ఈనెల 16ని సరైన తేదీగా ఖరారు చేసుకున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి ఆగస్టు 16న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి శంకుస్థాపన చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత భావించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించేలా కూడా జగన్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి పలు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తుండటంతో దాని నుండి విముక్తి పొందిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి శంకుస్థాపన చేపట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముందు ప్రత్యక్షం గానో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జగన్ ప్రభుత్వం భావించింది. అయితే ఈ నేపథ్యంలో కొత్త ముహూర్తంగా విజయదశమి నాడు ప్రధానిని విశాఖకు ఆహ్వానించే ప్రక్రియ మొదలైపోయినట్లు సమాచారం.విశాఖ శంకుస్థాపనకు ప్రధానిని స్వయంగా జగన్ ఢిల్లీ వెళ్లి ఆహ్వానించవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే అప్పటికైనా పరిస్థితి సద్దుమణుగుతుందా అన్న విషయం పై ఇంకా క్లారిటీ లేదు. ఇక మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రాష్ట్రం అంతటా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో జగన్ విశాఖ లో రాజధాని శంకుస్థాపన విషయంలో వెనక్కి తగ్గడం చిన్న విషయం కాదు. జగన్ అనుకుంటే శంకుస్థాపన అనుకున్న సమయానికి పూర్తి చేసేసేవాడు కానీ అతను వెనక్కి తగ్గాడు అంటే ఏదో బలమైన కారణం పైనే కేసులు నమోదయ్యాయని మళ్ళీ ఆ విషయంలో తొందరపడి పడడం ఇష్టంలేక జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న చర్చ జరుగుతోంది.

ఇక శంకుస్థాపన వాయిదా పడడం…. ఇలా ఎన్నో కొత్త అనుమానులు రావడం వైసీపీ అభిమానులకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక చివరికి ఏమవుతుందో చూడాలి.