https://oktelugu.com/

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ఎమ్మెల్యేలకు కరోనా సోకగానే సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతిచ్చారు.అప్పటిదాకా కరోనా వైద్యం కేవలం గాంధీ ఆస్పత్రికేనన్న కేసీఆర్ ఎమ్మెల్యేలకు రాగానే ఫ్లేట్ ఫిరాయించాడు. ఇక డబ్బున్న వాళ్లు అంతా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టేస్తున్నారు. డబ్బులేని పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోంది. జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్? తాజాగా తెలంగాణలో రెండు ఘటనలు వైద్యుల నిర్లక్ష్యాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2020 / 08:17 PM IST
    Follow us on


    తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ఎమ్మెల్యేలకు కరోనా సోకగానే సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతిచ్చారు.అప్పటిదాకా కరోనా వైద్యం కేవలం గాంధీ ఆస్పత్రికేనన్న కేసీఆర్ ఎమ్మెల్యేలకు రాగానే ఫ్లేట్ ఫిరాయించాడు. ఇక డబ్బున్న వాళ్లు అంతా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టేస్తున్నారు. డబ్బులేని పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.

    జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్?

    తాజాగా తెలంగాణలో రెండు ఘటనలు వైద్యుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టాయి. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలోనే నిన్న వెంటిలేటర్ తీసేయడంతో ఒక వ్యక్తి.. ఈరోజు పట్టించుకోపోవడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా సయ్యద్ అనే వ్యక్తి తెలంగాణలో వైద్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో కళ్లకు కట్టినట్టు వీడియో తీశాడు.

    కరోనా అందరిలోనూ మానవత్వాన్ని దూరం చేస్తోంది. కొన ఊపిరితో ఉన్న రోగుల పట్ల వైద్యులు కనికరం చూపడం లేదు. లక్షణాలు కనపడితే చాలు వైద్యం చేయడం లేదు వైద్యులు. అప్పట్లో జర్నలిస్ట్ మనోజ్ కూడా ఇలానే వైద్యం అందక మృతిచెందగా.. నిన్న మరో వ్యక్తి సేమ్ అలాగే ఊపిరి అందక మృతిచెందిన దైన్యం తెలంగాణలో కలకలం రేపింది.

    వైద్యుల కర్కశత్వంతో ఓ నిండు ప్రాణం నిన్న గాలిలో కలిసింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి వచ్చాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా వెంటిలేటర్ ను తొలగించారని.. చనిపోయే ముందు తండ్రికి రోగి సెల్ఫీ వీడియో పంపాడు. 3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదని గుండె ఆగిపోతోందని.. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ వ్యక్తి తల్లడిల్లాడు. వద్దన్న వినకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని.. తాను చచ్చిపోతున్నా అంటూ సదురు రోగి వీడియోలో వేడుకున్న వైనం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. తెలంగాణలో వైద్యం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

    హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

    ఈరోజు మరో వ్యక్తి కూడా ఇలానే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి వచ్చాడు.. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్చారు. ఆ ఐసీయూలో ఒక్కడే ఉండడంతోపాటు వైద్యులు ఎవరూ పట్టించుకోవడం లేదని .. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఈ ఉదయం చనిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

    తెలంగాణలో వైద్యుల నిర్లక్ష్యం ఈ రెండు ఘటనలతో బయటపడింది. వీడియో చూసిన నెటిజన్లు వైద్యులను తిట్టిపోస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు నిండు ప్రాణం బలయ్యాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జర్నలిస్టు మనోజ్ లాగే మరో ఇద్దరు తెలంగాణలో మరణించడం ఇక్కడ వైద్య సేవలు ఎంత అథమ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతున్నాయి.