https://oktelugu.com/

అరె.. బాలయ్య సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య బాబు’ సినిమా అంటేనే కథ ఎలా ఉన్నా, టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండాలనేది బాలయ్య బాబుగారి అబిష్టం. అందుకే పాపం బోయపాటి, బాలయ్య సినిమాకి టైటిల్ పెట్టడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాడు. టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా? […]

Written By:
  • admin
  • , Updated On : June 29, 2020 / 08:23 PM IST
    Follow us on


    ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య బాబు’ సినిమా అంటేనే కథ ఎలా ఉన్నా, టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండాలనేది బాలయ్య బాబుగారి అబిష్టం. అందుకే పాపం బోయపాటి, బాలయ్య సినిమాకి టైటిల్ పెట్టడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాడు. టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి.

    తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

    అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా ‘సూపర్ మాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. కాగా కథకు ‘సూపర్ మాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

    పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

    ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. మరి ఆ హీరోయిన్ బాలయ్య ఏజ్ కి సూట్ అవుతుందా లేదా అని అభిమానుల్లో కొంత టెన్షన్ ఉంది. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.