సరిహద్దులో యుద్ధానికి భారత్ సిద్ధం?

వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చైనాతో యుద్ధానికి భారత్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని రకాల అత్యాధునిక యుద్ధ విమానాలను, శతఘ్నులను, క్షిపణి రక్షక వ్యవస్థలను తయారుచేసుకుంటోంది. 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగల రఫెల్ యుద్ధ విమానాలను భారత్ సిద్ధం చేస్తోంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్‌ జెట్స్‌ లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో […]

Written By: Neelambaram, Updated On : June 29, 2020 8:21 pm
Follow us on

వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చైనాతో యుద్ధానికి భారత్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని రకాల అత్యాధునిక యుద్ధ విమానాలను, శతఘ్నులను, క్షిపణి రక్షక వ్యవస్థలను తయారుచేసుకుంటోంది.

150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగల రఫెల్ యుద్ధ విమానాలను భారత్ సిద్ధం చేస్తోంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్‌ జెట్స్‌ లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో దాడిచేయగలిగే సామర్థ్యం ఉంది. ఆకాశంతో పాటు భూమిపైన లక్ష్యాలను కూడా రఫెల్ సులభంగా చేధిస్తుంది. ఈ విమానాల నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. భారత అవసరాలకు అనుగుణంగా రఫెల్‌ లో మార్పులు చేశారు.  ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పేరున్న రఫెల్‌ తో పాక్, చైనాలకు చెక్ పెట్టవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

చైనా 1962లో భారత్‌ పై దాడి చేయడమే కాకుండా ఆక్సయ్‌చిన్‌ను ఆక్రమించుకుంది. అనంతరం 1967లో సిక్కింలోని నాథులా కనుమలో మరో సారి దురాక్రమణకు దిగింది. ఈ పోరులో చైనా విపరీతంగా నష్టపోయింది. చివరకు వారే వెనక్కువెళ్లారు.  1987లోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ లోని సమ్‌ దురాంగ్‌ ను ఆక్రమించుకునేందుకు బీజింగ్‌ విఫలయత్నం చేసింది. ఆ సమయంలో జనరల్‌ సుందర్జీ నేతృత్వంలో ఆపరేషన్‌ ఫాల్కన్‌, ఆపరేషన్‌ చెకర్‌ బోర్డు కార్యక్రమాలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన చైనీయులు వెంటనే ఆక్రమితప్రాంతాల నుంచి వెనుదిరిగారు. ఆర్థిక రంగంలో ఉదారవాద విధానాలతో చైనా ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో అమెరికాను కూడా దాటి అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది. ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే చైనా తీవ్రంగా నష్టపోవాల్సివుంటుందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  1962 తరువాత భారత్‌ సైనికంగానూ, ఆర్థికంగానూ బలపడింది. చైనా దగ్గర అణ్వాయుధాలుంటే మన దగ్గరా ఉన్నాయి. చైనాకు దీటుగా బదులివ్వగల సైన్యం, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే మన కంటే చైనా ఆర్థికంగా నష్టపోనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని సైనిక బలగాల కూర్పుపై అమెరికాకు చెందిన బెల్ఫర్‌ సెంటర్‌ అధ్యయనం చేసి ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.