పార్టీలను వదలని కరోనా భయం

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు పరిస్థితి మొన్నటివరకు ఒకవిధంగా.. ఇప్పుడు మరోవిధంగా మారిపోయింది. తిరుపతి లోక్‌ సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పార్టీలు అక్కడ మకాం వేశాయి. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ జరగబోతుండగా.. అయితే ఇప్పుడు అందరి దృష్టంతా పోలింగ్‌ శాతంపై పడింది. దేశమంతా ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ సీజన్‌ నడుస్తోంది. సెకండ్‌ వేవ్‌ జెట్‌ స్పీడ్‌లో దూసుకొస్తూ ప్రాణాలను హరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల […]

Written By: Srinivas, Updated On : April 14, 2021 2:53 pm
Follow us on

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు పరిస్థితి మొన్నటివరకు ఒకవిధంగా.. ఇప్పుడు మరోవిధంగా మారిపోయింది. తిరుపతి లోక్‌ సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పార్టీలు అక్కడ మకాం వేశాయి. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ జరగబోతుండగా.. అయితే ఇప్పుడు అందరి దృష్టంతా పోలింగ్‌ శాతంపై పడింది.

దేశమంతా ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ సీజన్‌ నడుస్తోంది. సెకండ్‌ వేవ్‌ జెట్‌ స్పీడ్‌లో దూసుకొస్తూ ప్రాణాలను హరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగానే పెరుగుతోంది. దీంతో ఇప్పుడు పోలింగ్‌ శాతంపై పార్టీల కన్ను పడింది. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న వందలాది మంది కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు. వారంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. ఇక దీనికితోడు ఆయా గ్రామాల్లోనూ.. పట్టణాల్లోనూ కేసులు భారీగానే నమోదవుతున్నాయి.

తిరుపతి ఎన్నికల ప్రచారం రేపటితో ముగియబోతోంది. రేపు సాయంత్రం 5 గంటలతో మైకులు మూగబోనున్నాయి. దీంతో ప్రచారానికి ఈ రోజు, రేపు సాయంత్రం వరకే ఛాన్స్‌ ఉండడంతో.. పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మైకులు పట్టుకొని ఉపన్యాసాలతో నాయకులు హోరెత్తిస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. అధికార పక్షం మాత్రం తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందుంచుతున్నాయి. గత పాలకుల వైఫ్యలాలు.. ఈ ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.

ప్రచారం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఓట్లు వేయడానికి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వస్తారా అనే భయం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాను చూసుకుంటే కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే టాప్‌ ప్లేస్‌లో ఉంది. దాదాపు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న తిరుపతి లోక్‌సభ స్థానంలో.. పోలింగ్‌ శాతం ప్రభావం కచ్చితంగా గెలుపు ఫలితంపై పడే అవకాశాలు లేకపోలేదు. అందుకే.. ప్రచారం ముగిసిన వెంటనే పార్టీలు పోలింగ్‌ శాతం పెంచే దిశగా కృషి చేయాలని భావిస్తున్నాయి.