సోనూ సూద్. కరోనా లాక్ డౌన్ వేళ రియల్ హీరో అయిన నటుడు. ఈయన చేసిన సాయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. బాలీవుడ్ తోపాటు దక్షిణాది భాషల్లో నటించి సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయనతో సాయం పొందిన వారు సోనూ పేరుతో షాపులు, పరిశ్రమలు, దుకాణాలు పెట్టేశారు.
అయితే విలన్ గా సినిమాల్లో కనిపించే ఈ రియల్ హీరో తన ఫిజికల్ ఫిట్ నెస్ కు మాత్రం ప్రాణం ఇస్తుంటాడు. తిన్నా తినకపోయినా కానీ రోజు ఎక్సర్ సైజ్ అంటే చాలా ఇష్టం.
ఇప్పుడు చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీలో కూడా సోనూసూద్ విలన్ గా నటిస్తున్నాడు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఉంటూ షూటింగ్ కు హాజరవుతున్నాడు.
అయితే ఉదయమే షూటింగ్ ఉండడంతో ఎక్సర్ సైజ్ కు టైం లేకుండా పోయింది. దీంతో హోటల్ నుంచి సెట్ కు వెళ్లేందుకు సోనూసూద్ సైకిల్ కొని దాన్ని తొక్కుకుంటూ వెళుతున్నాడు. అలా ఎక్సర్ సైజ్ అవుతుంది. ఇటు టైంకు షూటింగ్ కు హాజరైనట్టు ఉంది.
ఎంతైనా శరీర ఆరోగ్యం పట్ల సోనూసూద్ కు ఉన్న శ్రద్ధకు ఇది మచ్చు తునక అని అంటున్నారు. సోనూసూద్ కమిట్ మెంట్ ను ప్రశంసిస్తున్నారు.