ఏపీలో 1600కు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1600 కు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది బాధితులు మరణించారు. జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి? రాష్ట్రంలో ఇంకా 1,062 యాక్టివ్‌ కేసులు ఉండగా, 488 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 30 […]

Written By: Neelambaram, Updated On : May 3, 2020 5:11 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1600 కు చేరువైంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది బాధితులు మరణించారు.

జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?

రాష్ట్రంలో ఇంకా 1,062 యాక్టివ్‌ కేసులు ఉండగా, 488 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 30 ఉండగా, గుంటూరులో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురంలో 7, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రధాన కేంద్రంగా మారిన కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 466కు చేరగా, తర్వాతి స్థానంలో ఉన్న గుంటూరులో కేసుల సంఖ్య 319కి చేరింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్‌ను పరీక్షించగా 58 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!

ఇలా ఉండగా, లాక్ డౌన్ మినహాయింపులు ఇస్తూ.. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించినా తెలంగాణ నుంచి ఏపీలోకి వస్తున్నవారిని సరిహద్దు చెక్ పోస్టులవద్ద అడ్డుకొంటున్నారు. దానితో వారు దిక్కుతోచక ఆందోళనకు దిగుతున్నారు.

తమ వద్ద పాసులు ఉన్నా అనుమతించడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ పోలీసు అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు చూపిస్తున్నా అవి చెల్లవని అధికారులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

కాగా సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు అక్కడే ఉండాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

కరోనా విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమకరమని సీఎం హితవుపలికారు. ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువని హెచ్చరించారు.