కరోనా సేవకులకు లతా మంగేష్కర్ సంఘీభావం

కరోనా మహమ్మారి ఫై మన తరఫున పోరాటం చేస్తున్న వైద్యులు మరియు వారి సహాయక సిబ్బంది , పోలీసులు , పారిశుద్ధ్య కార్మికుల సేవలను మనం జీవితాంతం గుర్తుపెట్టుకోక తప్పదు . తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారికి సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత మనకుంది. ఆ క్రమంలో ఇపుడు ప్రసిద్ధ గాయనీ మణి లతా మంగేష్కర్ ఒక గొప్ప పని చేసింది . మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా! ఇండియన్ సింగర్స్ […]

Written By: admin, Updated On : May 3, 2020 3:00 pm
Follow us on


కరోనా మహమ్మారి ఫై మన తరఫున పోరాటం చేస్తున్న వైద్యులు మరియు వారి సహాయక సిబ్బంది , పోలీసులు , పారిశుద్ధ్య కార్మికుల సేవలను మనం జీవితాంతం గుర్తుపెట్టుకోక తప్పదు . తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారికి సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత మనకుంది. ఆ క్రమంలో ఇపుడు ప్రసిద్ధ గాయనీ మణి లతా మంగేష్కర్ ఒక గొప్ప పని చేసింది .

మోదీకి లాక్ డౌన్ విషయంలో దిక్కు తోచడం లేదా!

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో 100 మంది గాయనీ గాయకులు 14 భాషల్లో ” వన్ నేషన్ వన్ వాయిస్ ” పేరుతొ ఒక గీతాన్నిఆలపించారు. లతా మంగేష్కర్ , ఆశా భోంస్లే , అల్కా యజ్ఞిక్ ,హరిహరన్ ,కైలాష్ ఖేర్ , కవితా కృష్ణ మూర్తి , కుమార్ సాను , ఎస్ పి. బాలసుబ్రమణ్యం వంటి మేటి గాయనీ గాయకులు ఈ గీతారాధన లో పాల్గొన్నారు దేశమంతా ఏకమై కరోనా ఫై పోరు సలపాలని లతా జీ ఆశిస్తూ ఈ పాటను జాతికి అంకితం చేయబోతున్నారు . .