Congress Party: కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దూరమైన ప్రతిష్టను తిరిగి తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిరంలో మేథోమథనం నిర్వహించింది. ఈ మేరకు పలు తీర్మానాలు చేసింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీకి జవసత్వాలు నింపేందుకు తాపత్రయపడుతోంది.
ఈ మేరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించింది. దీనికి అక్టోబర్ నెలను ఎంచుకుంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాలను కలుపుని పాదయాత్ర చేసి ప్రజల్లో పట్టు నిలుపుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గతంలో బీజేపీ కూడా ఇలాగే రథయాత్ర నిర్వహించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే దారిలో కాంగ్రెస్ కూడా వెళ్లేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.
మరోవైపు దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పెట్రోధరల పెరగడం వంటి సమస్యలతో జనం కుదేలవుతున్నారు. వారిని ఓదారుస్తూ పాదయాత్ర చేయాలని భావిస్తోంది. దీని కోసం రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి చైర్మన్ గా దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తారని చెబుతున్నారు. దీంతో పోయిన పరువు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
యువతకు ప్రాధాన్యం ఇచ్చి రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు త్యాగాలు చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చేలా చూడాలని చెబుతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తోంది. ఇందు కోసం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ కోసం కార్యకర్తలు కృషి చేసి మరోమారు అదికారంలోకి తీసుకురావడానికి కంకణబద్దు కావాలని ఆశిస్తోంది. కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను అందరు తీసుకోవాలని సూచిస్తోంది. బీజేపీని అధికారానికి దూరం చేసి పార్టీని అధికారంలో ఉంచడమే ధ్యేయంగా ముందకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తిస్తున్నారు.
Also Read: Russia-China Presidents: ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన అధ్యక్షులు. కానీ వాళ్ళు బతకటం కష్టమే!
Recommended Videos: