Telugu Bigg Boss Akhil: బిగ్ బాస్ నాన్ స్టాప్ రక్తికడుతోంది. అందులోని కంటెస్టెంట్ల తెలివితేటలకు హోస్ట్ నాగార్జుననే కాదు.. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఎత్తులు, పైఎత్తులతో చదరంగాన్ని తలపిస్తోంది. బిగ్ బాస్ విజేతగా గెలవడం కోసం తన, పర బేధం మరిచి బంధాలకు నీళ్లొదలి కేవలం కమర్షియల్ గానే సాగుతున్న ఈ వైనం ఆసక్తి రేపుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బంధాలకు కంటెస్టెంట్లు విలువ ఇవ్వడం లేదు. ముఖ్యంగా అఖిల్ తీరు చర్చనీయాంశమైంది. కేవలం తన స్వార్థం కోసం.. తను గెలవడం కోసం తోటి కంటెస్టెంట్లను వాడుకుంటున్న తీరు అందరినీ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ లో గ్రూప్ ఇజాన్ని ప్రోత్సహించిందే అఖిల్ అన్న పేరుంది. అందరినీ గ్రూప్ గా మలిచి ‘బిందుమాధవి’ని అణగదొక్కాలని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అది జరగకపోవడం.. తన గ్రూపులోని ఒక్కొక్కరూ బయటకు వెళుతుండడంతో ఇక తనే బిందుతో స్నేహాన్ని కొనసాగించి వ్యతిరేకతను తగ్గించుకునే పని చేశాడు. ఇక అది వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు బయటకు వెళ్లే వారి అభిమానుల మద్దతు తనకు దక్కేలా నక్కజిత్తుల వ్యవహారాలు చేస్తున్నాడు.
అఖిల్ పరిస్థితులను బట్టి స్నేహాలను, బంధాలను కొనసాగిస్తున్నాడనే పేరు పొందాడు. తనకు లాభం జరగడం కోసం ఎదుటివారిని ముంచడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తను విన్నర్ కావడానికి తోటి కంటెస్టెంట్లను పావులుగా వాడుకుంటున్నాడన్న విమర్శ ఉంది. గత చివరి వారంలో తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన అనిల్ ను సపోర్ట్ చేయకుండా తనతో పాటు అందర్నీ కూడా అనరాని మాటలన్న నటరాజ్ మాస్టర్ కి సపోర్ట్ చేయడంతో అఖిల్ డబుల్ స్టాండర్డ్స్ బయటపడింది. ఇటీవలే ఓ టాస్క్ లో అఖిల్, నటరాజ్ లు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇద్దరూ కొట్టుకోవడమే తక్కువ. నటరాజ్ మాటలకు, అఖిల్ కౌంటర్లతో హౌస్ దద్దరిల్లింది. వీరిద్దరూ శత్రువుల్లా మారిపోయారు. అయితే ఎలిమినేషన్ సందర్భంగా నటరాజ్ వెళ్లిపోతుండడంతో అతడి ఫ్యాన్స్ ఓట్ల కోసం.. అఖిల్ చక్రం తిప్పాడు. నటరాజ్ పై పాజిటివ్ గా స్పందించి.. తనకు ఎంతో సపోర్ట్ గా నిలబడ్డ అనిల్ ను దూరం పెట్టాడు. దీంతో అఖిల్ నక్కజిత్తులకు అనిల్ షాక్ అయిన పరిస్థితి నెలకొంది. అంత తిట్టుకొని నటరాజ్ కు అఖిల్ సపోర్టు చేయడం ప్రేక్షకులకు కూడా షాకింగ్ గా మారింది. ఇలా రంగులు మార్చే అఖిల్ ను జనాలు కూడా నమ్మడం కష్టమేనంటున్నారు.

తనతో గొడవ పెట్టుకొని తిట్టిపోసినా సరే నటరాజ్ మాస్టర్ కి సపోర్ట్ చేయడానికి కారణం… బయటకు వెళ్ళాక బిందు పై దాడి కంటిన్యూ చేస్తూ, అఖిల్ కి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి నటరాజ్ లాంటి వాళ్ళ అవసరం అఖిల్ కు ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో అఖిల్ కు పోటీ బిందుమాధవినే. బిందు అంటేనే పడని నటరాజ్ బయటకు వెల్లడంతో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడానికి.. తనకు పాజిటివ్ గా బయట మార్చడానికి నటరాజ్ ను సైతం అఖిల్ బుట్టలో పడేసి ఈ క్రమంలోనే సపోర్టు చేసినట్టు తెలుస్తోంది. అందుకు తనకు సాయం చేసిన అనిల్ ను దూరం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ప్రతిదాన్ని ఆలోచించికుండా గుడ్డి ఎద్దు చేల్లో పడ్డ చందంగా వెళుతున్న నటరాజ్ సైతం ఈ విషయంలో అఖిల్ మాయలో పడిపోయాడు. బయటకు రాగానే బిందుపై నోరుపారేసుకొని అఖిల్ అనుకున్నట్టే మాట్లాడడం మొదలుపెట్టాడు.
ఎవరెన్ని చెప్పినా.. నటరాజ్ లాంటి వింత మనిషి ఎంత దుష్ప్రచారం చేసిన బిగ్ బాస్ ను ఫాలో అవుతున్న ప్రేక్షకులు మాత్రం బిందుమాధవిలోని నిజాయితీని చూశారు. అఖిల్ లోని నక్కజిత్తులను పసిగట్టారు. అందుకే వారు సరైన వారినే విజేతలుగా ఎంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. నమ్మిన వాడిని మోసం చేసి గెలవాలనుకునే అఖిల్ ను జనాలు నమ్మే పరిస్థితి లేదు. నటరాజ్ లాంటి వారు ఎంత యాగీ చేసినా బిగ్ బాస్ విజేతను మార్చలేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read: Adani: నాట్ ఇంట్రెస్ట్: రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్న అదాని..
Recommended Videos:


