Rythu Bharosa: రైతుకు సాగు ప్రోత్సాహం కింద ఏటా రూ.15 వేలు అందిస్తాం. సాగు పెట్టుబడుల భారం నుంచి ఉపశమనం కలిగిస్తాం. ప్రతీ రైతుకు వర్తింపజేస్తాం. ఎన్నికల ముందు విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలివి. కానీ అధికారంలోకి వచ్చేసరికి మాట మార్చేశారు. రూ.7,500తో సరిపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6 వేలతో కలిపి రూ.13,500 విడతలవారీగా అందిస్తున్నారు. అయితే మొత్తం తామే అందిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. రూ.5,500లను ఖరీఫ్ లో, రూ.2000 రబీలో అందిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పథకం కింద మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున అందిస్తోంది. తొలుత అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ద్రుష్ట్యా తొలుత తాను చెప్పిన రూ.15 వేలు అందించలేనని.. రూ.7,500 మాత్రమే ఇవ్వగలనని సీఎం జగన్ చెప్పినా రైతుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ ఇటీవల రకరకాల కారణాల చూపుతూ రైతుభరోసా పథకానికి సంబంధించి లబ్దిదారుల జాబితాలో కోత వేశారు. రకరకాల కొర్రీలు తెరపైకి తెచ్చి లక్షలాది మంది రైతులకు పథకాన్ని దూరం చేశారు. ప్రభుత్వం మాత్రం తాము లబ్ధిదారులకు కోత పెట్టలేదని చెప్పుకొస్తోంది.

ఆర్భాటపు ప్రకటనలు
మూడో ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ఆర్ రైతుభరోసా పథకం కింద సోమవారం నిధులు విడుదల చేసింది. సుమారు 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3700 కోట్లు జమ చేసినట్టు ప్రకటించింది. అంతటితో ఆగకుండా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన దాని ప్రకారం చూస్తే ప్రతీ రైతుకు రూ. ఏడున్నర వేలు రావాలి. కానీ ఐదున్నర వేలే జమ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే రెండు వేలకు కూడా ఇప్పుడు తాము మీట నొక్కుతున్న అకౌంట్‌లో కలిపేశారు. వాస్తవానికి కేంద్రం వాటా రూ.2 వేలు ఈ నెలాఖరులో అందించనున్నట్టు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రెండు వేలను కలిపి లెక్క చెబుతోంది. ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చే ఆరు వేలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో చూపిస్తోంది. నిజానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు చాలా మంది రైతుల ఖాతాల్లో పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 50 లక్షల మంది రైతుల్లో కేంద్ర అందిస్తున్న సాయం 30 లక్షల మందికి మాత్రమే అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read: Bigg Boss Nataraj Master: ఏకి పారేసిన నాగార్జున.. మోకాళ్లపై నిలబడి సారి చెప్పిన నటరాజ్ మాస్టర్..
కేంద్రం వాటాతో కలిపే..
రాష్ట్ర ప్రభుత్వ సాయంగా ఇప్పుడిస్తున్న రూ.5,500లకు అదనంగా రూ.4,000 అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ అది వాస్తవం కాదు. కేంద్ర సాయం మూడు విడతల్లో రూ.6 వేలతో పాటు మరోసారి రూ.2 వేలు తన వాటాగా అందించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ , రబీ సాయం కేవలం రూ.7,500 మాత్రమే. కేంద్రం పీఎం కిసాన్ ను ప్రకటించక ముందే జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో పన్నెడున్నరవేలు రైతుకు మేలో ఒకే సారి ఇచ్చి పంటకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. కానీ అధికారంలో వచ్చాక మాట మార్చేశారు. కేంద్రం ఇస్తోంది కదా అని తము కత్తిరించేశారు. కానీ తామే ఇస్తున్నట్లుగా మీటలు నొక్కుతున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతులకు ఒకే సారియాభై వేల వరకూ లబ్ది చేకూర్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి ఐదారువేలు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఉన్న ఇతర పథకాలన్నింటినీ ఆపేశారు. ప్రభుత్వ పరంగా రైతులకు ఏ ఒక్క పథకం దన్నూ ఉండటం లేదు.
Also Read: Congress Party Maha Padayathra: మహాపాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా?
Recommended Videos:



[…] […]