Haryana Elections 2024: హర్యాన అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. సుమారు వెయ్యి మంది 90 స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే గడువు ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల గుప్పిస్తున్నాయి. సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు.. బీజేపీకి దూరం చేసేందుకు కాంగ్రెస్ ఎత్తుల మీద ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మేనిఫెస్టోలో పలు గ్యారంటీ హామీలతోపాటు.. అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగ సమస్య, పదేళ్లలో రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఇక బీజేపీ కూడా పదేళ్ల అభివృద్ధిని చూపిస్తూనే ఓట్లు అడుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు దీటుగానే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ తరుణంలో ప్రచారం చివరి వారం రోజుల్లో గెలుపు కోసం కాంగ్రెస్ మరో మెగా ప్లాన్ సిద్ధం చేసింది. దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
రాహుల్ రథయాత్ర..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి వారం రోజుల్లో ఏఐసీసీ అగ్రనేత, రాహుల్‌గాంధీతో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. చివరి వారంలో పూర్తి బలం చాటేందుకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు రథయాత్ర పలు నియోజకవర్గాల్లో సాగేలా ప్లాన్ చేసింది. ఇప్పటికే రాహుల్‌గాంధీ ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాలతోపాటు.. గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాల మీదుగా రథయాత్ర సాగేలా కాంగ్రెస్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ పర్యటనలో ఒకటి లేదా రెండు రోజులు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ప్రత్యేక ఎన్నికల ర్యాలీ కూడా నిర్వహిస్తారని సమాచారం.
ప్రచారం ప్రారంభించిన రాహుల్..
ఇక రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారాన్ని అసంత్ నుంచి గురువారం ప్రారంభించారు. అసంద్, హిసార్‌లో జరిగే ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. హర్యానా ప్రభుత్వం రాష్ట్రాన్ని పదేళ్లలో నాశనం చేసిందని ఆరోపించారు. ఇక్కడి యువత పొలాలు అమ్ముకుని అమెరికా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. హిసార్‌లోని బర్వాలాలో రాహుల్ మాట్లాడుతూ సాధారణంగా బబ్బర్ సింహం ఒంటరిగా కనిపిస్తుందని, అయితే ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మోదీ ముఖం చూశాం గతంలో అని ఛాతీ 56 అంగులాలు ఉండేది.. ఇప్పుడు అతి పలుచబడింది అని విమర్శించారు.