https://oktelugu.com/

Devara: ఆ ప్రాంతంలో 9 ఏళ్ళ నుండి చెక్కుచెదరని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రికార్డు..’దేవర’ కూడా దాటలేకపోయింది!

దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విడుదలైన ఈ చిత్రానికి భారీ అంచనాలు కారణంగా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో అనేక ప్రాంతాలలో ఈ చిత్రం బాహుబలి ఓపెనింగ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 27, 2024 3:25 pm
    Devara Movie

    Devara Movie

    Follow us on

    Devara: కొన్ని సినిమాల ఓపెనింగ్స్ దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాలలో చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాంటి రికార్డ్స్ ఎక్కువగా మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకు చూస్తుంటాం. అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఓపెనింగ్ వసూళ్లు అలాంటివి. 2014 ఎన్నికల్లో విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన చిత్రమిది. ఈ సినిమాకి ముందు ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అయితే ‘గోపాల గోపాల’ చిత్రం లో పవన్ కళ్యాణ్ పోషించింది గెస్ట్ పాత్ర మాత్రమే. ‘అత్తారింటికి దారేది ‘ తర్వాత ఆయన నుండి వచ్చిన సోలో చిత్రం ఇదే.

    దాదాపుగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విడుదలైన ఈ చిత్రానికి భారీ అంచనాలు కారణంగా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో అనేక ప్రాంతాలలో ఈ చిత్రం బాహుబలి ఓపెనింగ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటే, ఏ స్థాయి ఓపెనింగ్ అనేది అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి సెన్సేషనల్ ఓపెనింగ్ దక్కించుకుంది అనేది. ఉదాహరణకు తాడేపల్లి గూడెం లో ఈ సినిమాకి మొదటి రోజు 16 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    ఇది అప్పట్లో ఆల్ టైం రికార్డు గా నిల్చింది. ఈ 9 ఏళ్లలో స్టార్ హీరోల సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి, పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి, కేవలం #RRR చిత్రం మినహా, మిగిలిన సినిమాలు ఒక్కటి కూడా ఈ సినిమా ఓపెనింగ్ ని అందుకోలేకపోయింది. అయితే దేవర చిత్రం కచ్చితంగా ఈ రికార్డు ని బద్దలు కొడుతుందని అందరూ అనుకున్నారు, కానీ మొదటి రోజు ఈ చిత్రం కేవలం 14 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టే అవకాశం ఉందట. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంతో పాటు, అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలలో ఎదో ఒక సినిమాకి ఈ రికార్డు ని కొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రికార్డు రామ్ చరణ్ కి దక్కుతుందా, లేదా అల్లు అర్జున్ కి దక్కుతుందా అనేది చూడాలి. ఈ రెండు మిస్ అయితే మళ్ళీ పవన్ కల్యాణే ఈ రికార్డుని బ్రేక్ చేస్తాడని అంటున్నారు.