ఏపీలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తోంది. ఇప్పటికే క్రిస్మస్ నేపథ్యంలో పలు జిల్లాల్లో పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్.. ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. నవరత్నాల అమలులో భాగంగా- పేదలందరికీ ఇళ్లు అందించేందుకు జిల్లా పర్యటన చేయనున్నారు.
Also Read: నారాయణ విమర్శలకు రోజా కౌంటర్
పైలాన్ ఆవిష్కరణ.. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం భారీ లే అవుట్ వేశారు. 4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ 428 మంది రైతుల నుంచి రూ.101.73 కోట్లతో భూమిని కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లా మొత్తం 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు ఉన్నారు.
Also Read: ఆలూ లేదు.. సూలూ లేదు.. కానీ అప్పుడే నామకరణం
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మొత్తం 1,164 లే అవుట్‌లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. జగనన్న ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నారని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కూడా ఒకటి. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మనస్సులో గూడు కట్టుకున్న జగన్.. ఇప్పుడు ఇళ్ల పట్టాలు కూడా అందిస్తుండడంతో వారికి మరింత చేరువవుతున్నారు