ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో పోలవరం ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల గురించి మోదీ ప్రస్తావించారు. సీఎం జగన్ వచ్చే సంవత్సరం చివరినాటికి పోలవరం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం 15 వేల కోట్ల రూపాయలు అవసరమని…. నాబార్డు నుంచి 15 వేల కోట్ల రూపాయలు తీసుకోవడానికి అనుమతించాలని అన్నారు.
Also Read: కాంగ్రెస్ భవిష్యత్తు ను నాశనం చేస్తున్న గాంధీలు
కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కోసం 3805 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉందని ఆ నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని చెప్పారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని… రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు ద్వారా నిధుల విడుదలలో నిర్వహణపరమైన జాప్యాన్ని నిరోధించడం సాధ్యమవుతుందని… తద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
Also Read: టీడీపీలో మరో విషాదం…. కీలక నేత మృతి…?
కేంద్రం విధివిధానాల వల్ల నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని నిబంధనలను సులభతరం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పునరావాసం కొరకు 5 వేల కోట్లు, ప్రధాన డ్యాం పనులకు 5 వేల కోట్లు, కాల్వల కోసం 5 వేల కోట్లు కేటాయించాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలు ఇస్తే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 12,312.088 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిందని సమాచారం.