టీడీపీలో మరో విషాదం…. కీలక నేత మృతి…?

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విషాదాలు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన కీలక నేత రాడ మోహనరావు నిన్న రాత్రి కన్నుమూశారు. న్యాయవాదిగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా రాడ మోహనరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్న రాడ మోహనరావు 2014 సంవత్సరంలో బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సన్నపేట నియోజకవర్గంలో ఆయన ముఖ్య నేతగా ఉన్నారు. స్థానికంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాడ మోహనరావు […]

Written By: Kusuma Aggunna, Updated On : August 27, 2020 11:52 am
Follow us on

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విషాదాలు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళానికి చెందిన కీలక నేత రాడ మోహనరావు నిన్న రాత్రి కన్నుమూశారు. న్యాయవాదిగా, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా రాడ మోహనరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా పేరు తెచ్చుకున్న రాడ మోహనరావు 2014 సంవత్సరంలో బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సన్నపేట నియోజకవర్గంలో ఆయన ముఖ్య నేతగా ఉన్నారు. స్థానికంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాడ మోహనరావు మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయనకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు. నర్సన్నపేట మండలంలోని నడగాం గ్రామానికి ఆయన పశు వైద్యశాల కొరకు, పాఠశాల కొరకు ఆయన సొంత భవనాలను ఇచ్చారు. మండల ఉపాధ్యక్షుడిగా, డీసీసీబీ డైరెక్టరుగా, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా, వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. ఆయన కృషి వల్ల నడగాం 1963 నుంచి 2013 వరకు ఏకగ్రీవ పంచాయతీగా కొనసాగింది.

జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న రాడా మోహనరావు భార్య చెల్లాయమ్మ నడగాం సర్పంచ్ గా పని చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాడ మోహనరావు మృతి తీరని లోటని సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన తన సేవలను అందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని వారు తెలిపారు. రాడ మోహనరావు మృతితొ నడగాం గ్రామంలో, నర్సన్నపేట నియోజవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.