https://oktelugu.com/

CM Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీకి జగన్.. అసలు కథేంటి?

CM Jagan Delhi Tour: ఏపీలో ముందస్తు ఎన్నికలకు క్లారిటీ రానుందా? అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారా? ఇప్పుడిదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. రెండు నెల వ్యవధిలో సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండడం రాజకీయ వర్దాల్లో హాట్ టాపిక్ గా మారింది. చివరిగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో […]

Written By:
  • Dharma
  • , Updated On : June 2, 2022 / 09:28 AM IST
    Follow us on

    CM Jagan Delhi Tour: ఏపీలో ముందస్తు ఎన్నికలకు క్లారిటీ రానుందా? అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారా? ఇప్పుడిదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. రెండు నెల వ్యవధిలో సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండడం రాజకీయ వర్దాల్లో హాట్ టాపిక్ గా మారింది. చివరిగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన హామీ చట్టంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిల చెల్లింపు తదితర వాటిపై సీఎం జగన్ చర్చించారు. ఇప్పుడు మరోసారి హస్తినకు పయనమవుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఆయన మరోసారి ఢీల్లీకి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే కేవలం రాష్ట సమస్యలు.. ఆర్థిక అంశాలే కాకుండా.. రాష్ట్ర పతికి ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

    CM Jagan, modi

    మరికాసేపట్లో..
    ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీలో పర్యటించనున్నారు . ఉదయం 11-30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడ నుంచి వన్ జన్‌ఫథ్ కు చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది. దావోస్ వేదికగా ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల క్రితమే తాడేపల్లికి వచ్చారు.

    Also Read: Telangana Formation Day 2022: తెలంగాణకు ఎనిమిదేళ్లు.. నాటికి నేటికి ఏం మారింది?

    ఒక్క రోజు విరామం వెంటనే ఢిల్లీ బాట పట్టారు. ఈ పర్యటనలో సీఎంవో వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులతో పాటు థావోస్ పర్యటన విశేషాలపై కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై కూడా ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న వివాదాల పరిష్కారం కోసం ప్రధానిని చొరవ చూపించాలని కోరే అవకాశం ఉంది.

    CM Jagan

    ముందస్తు అనుమతి కోసమే..
    రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పాలన పై విమర్శలు, సంక్షేమ పథకాల భారం తదితర కారణాలతో జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లేలా ఆయన కసరత్తు చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఇటీవల సామాజిక న్యాయ భేరి పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని.. అలాగే వైసీపీ నేతలంతా గడప గడపకు ప్రభుత్వం పేరుతో జనాల్లో ఉంటున్నారని.. మరిన్ని కార్యక్రమాలకు ఢీల్లీ పర్యటన తరువాత జగన్ శ్రీకారం చుడతారని.. ఆయన సైతం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాల టాక్. ఇప్పటికే మహానాడు సక్సెస్ కావడం, బాదుడే బాదుడుతో టీడీపీ జోరు మీద ఉండడం కూడా అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    Also Read:ACB App in AP: ఏపీలో లంచాలకు చెక్.. జగన్ సంచలన నిర్ణయం..

    Recommended Videos:


    Tags