https://oktelugu.com/

జగన్‌ చేతుల మీదుగా వారికి సన్మానం

ప్రభుత్వ పథకాలను గడగడపకూ అందించాలనే లక్ష్యంతో.. పేదలు ఎక్కడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వలంటీర్లను వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్‌ అధికారం చేపట్టాక వెంటనే గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. వలంటీర్ల సేవలను గుర్తించిన సీఎం జగన్ వారికి జీతాలు పెంచడం మినహా గొప్ప గౌరవ మర్యాదలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. వారు అందించే సేవలను బట్టి మూడింటిలో ఒక […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2021 / 02:39 PM IST
    Follow us on


    ప్రభుత్వ పథకాలను గడగడపకూ అందించాలనే లక్ష్యంతో.. పేదలు ఎక్కడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వలంటీర్లను వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్‌ అధికారం చేపట్టాక వెంటనే గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. వలంటీర్ల సేవలను గుర్తించిన సీఎం జగన్ వారికి జీతాలు పెంచడం మినహా గొప్ప గౌరవ మర్యాదలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. వారు అందించే సేవలను బట్టి మూడింటిలో ఒక దానికి ఎంపిక చేస్తారు. వాటికి నగదు పురస్కారాలు కూడా ఉంటాయి.

    Also Read: మార్పు మొదలైందంటున్న పవన్.. సంతోషానికి కారణమేంటి?

    మూడు ప్రాంతాల్లో జరిగే సన్మాన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనాలని నిర్ణయించారు. ఆయన వలంటీర్లను ఆత్మ బంధువులుగా చూస్తుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ, విధులకు హాజరు, యాప్‌ల వినియోగం.. పథకాల అమల్లో చురుగ్గా భాగస్వామ్యం అయిన వారికి అవార్డులు లభించనున్నాయి.

    మొదటి కేటగిరి సేవామిత్ర కోసం ప్రశంశాపత్రంతోపాటు రూ.పదివేల నగదు ఇస్తారు. రెండో కేటగరిలో రూ.ఇరవై వేల పురస్కారం ఇస్తారు. రెండో కేటగిరిలో ప్రతీ మండలానికి ఐదుగురు వలంటీర్లకు అవార్డులిస్తారు. మూడో కేటగిరిలో క్యాష్ ప్రైజ్ రూ.30 వేలు ఇస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురిని ఎంపిక చేస్తారు. వీరందరి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. ఉగాది నుంచి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    Also Read: ఆ సీటుపై కేసీఆర్‌‌లో పెరుగుతున్న టెన్షన్‌

    వలంటీర్లు రూ.ఐదు వేలకే పని చేస్తున్నారు. ఇటీవల జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. జీతాలు పెంచే చాన్సే లేదని.. వారు సేవ మాత్రమే చేస్తున్నారని తేల్చిన సీఎం జగన్.. సేవలకు గుర్తుగా అవార్డులు ఇస్తామన్నారు. ఆ ప్రకారం ఇప్పుడు అవార్డులు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవార్డులే ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొంటుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు వలంటీర్లు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్